
జాతీయ భద్రత కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరమైనా వెళ్లడానికి భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి పరంగా జి20 అన్వేషిస్తున్న పరిష్కారంలో భారత్‌లో 15 శాతం ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని పూణెలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్వహించిన 'ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్'లో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ప్రకటనను మంత్రి ఎస్ జైశంకర్ ఉదహరించారు.
భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)ఏడు శాతం పెరుగుతోందని, రాబోయే దశాబ్దంలో కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో 15 శాతం భారతదేశం నుండి వస్తుందని క్రిస్టాలినా జార్జివా చెప్పారని తెలిపారు. కోవిడ్ సవాళ్లను ఎలా నిర్వహించామో కూడా జీ 20 దేశాలు చూశాయని అన్నారు. ప్రతి దేశానికి దాని స్వంత సవాళ్లు ఉంటాయని, అయితే జాతీయ భద్రతకు సమానమైన ప్రాధాన్యత ఏదీ ఇవ్వయని కానీ.. భారత్ భద్రతకు చాలా ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు.
గత కొన్నేళ్లుగా పశ్చిమ సరిహద్దు నుంచి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయనీ, ఈసారి విషయాలు కొంచెం భిన్నంగా ఉన్నాయని, అందరూ అంగీకరిస్తారని అన్నారు. 2016 నుంచి 2019 మధ్య పలు సంఘటనలు జరిగాయని, మమ్మల్ని పరీక్షించడానికి పలు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఉత్తర సరిహద్దు నుంచి కూడా సవాళ్లు వస్తున్నాయనీ, వాటిని నుంచి భారత్ ఎలా బయటపడుతుందనే దానిపై మన సత్తాను తెలియజేస్తుందని అన్నారు. దేశ భద్రత గురించి మాట్లాడుతూ.. దేశ భద్రతను కాపాడుకోవడానికి అన్నింటికీ సిద్ధంగా ఉన్న దేశం భారతేననీ, మన దేశం చాలా సంయమనంగా ఉందనీ, ఇతరులతో పోరాడుతున్న దేశం కాదనీ, కానీ ప్రాథమిక పరిమితులను దాటనివ్వని దేశమని అన్నారు. వివిధ దేశాలు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయనీ, వారి పట్టుదలని ప్రదర్శిస్తాయనీ, కొన్నిసార్లు వారు బలమైన చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు.
ఉక్రెయిన్ సంఘర్షణను ప్రస్తావిస్తూ.. ఈ వివాదం వల్ల వచ్చిన ఒత్తిళ్లు, మన దేశ స్వేచ్ఛ, విశ్వాసాన్ని పరిక్షించాయనీ,ఆ సమయంలో భారత్ ఇతరుల హక్కుల కోసం నిలబడిందనీ, ఆ అంశాన్ని ప్రపంచదేశాలు గమనించాయని అన్నారు. గ్లోబల్ సౌత్‌లోని 125 దేశాలతో భారత్ జి-20 గ్రూప్ ఛైర్మన్‌గా.. ప్రధానమంత్రి స్థాయిలో, స్వయంగా విదేశాంగ మంత్రి స్థాయిలో, ఆర్థిక మంత్రి, వ్యాపార మంత్రి, పర్యావరణ మంత్రి స్థాయిలో చర్చించిస్తుంది.
భారతదేశం యొక్క G-20 ప్రెసిడెన్సీ డిసెంబర్ 2022లో ప్రారంభమైంది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తమ విస్తారమైన జనాభాకు టీకాలు వేయడంలో భారతదేశం సాధించిన విజయాన్ని G-20 దేశాలు గుర్తించాయని విదేశాంగ మంత్రి చెప్పారు.టీకాలు వేయడం చాలా సులభం అనిపిస్తుందనీ, అయితే ఈ టీకా కోసం పోరాడిన దేశాలు ఉన్నాయని అన్నారు. అయితే అర్హత ఉన్న వ్యక్తులందరికీ టీకాలు వేయడంలో భారతదేశం విజయవంతమైందని, ఆ విషయం ప్రపంచం కూడా గమనించిందని అన్నారు. డేటా భద్రత,డేటా గోప్యత డిజిటల్ ప్రపంచంలో అతిపెద్ద సవాళ్లని, వాటికి సంబంధించిన సమస్యలు G-20 సమావేశంలో పరిష్కరించబడతాయని ఆయన అన్నారు.