కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం, ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి అడ్డంకి: ప్రధాని మోడీ

Published : Jul 07, 2023, 10:31 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం, ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి అడ్డంకి: ప్రధాని మోడీ

సారాంశం

Raipur: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ప్ర‌ధాని న‌రేంద్రమోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు నిదర్శమని అభివర్ణించారు. రాష్ట్రం కాంగ్రెస్ కు ఏటీఎంలా మారింద‌నీ, అందుకే ఛత్తీస్‌గఢ్ నేతలకు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.

Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ప్ర‌ధాని అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు నిదర్శమని అభివర్ణించారు. రాష్ట్రం కాంగ్రెస్ కు ఏటీఎంలా మారింద‌నీ, అందుకే ఛత్తీస్‌గఢ్ నేతలకు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టిన క్ర‌మంలో ప్ర‌ధాని మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

పలు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం..

సైన్స్ కళాశాల మైదానంలో సుమారు రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ ప్రసంగించారు. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. "ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి వచ్చే 25 ఏళ్లు ఎంతో కీలకం. కానీ రాష్ట్ర అభివృద్ధి ముందు ఓ పెద్ద చెయ్యి (కాంగ్రెస్) గోడలా నిలబడింది. ఇది కాంగ్రెస్ హస్తం. ఈ చేయి మీ హక్కులను కాలరాస్తోంది. రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది" అని విమ‌ర్శించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు ఆదర్శంగా నిలిచిందనీ, ఇది కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని అన్నారు. అందుకే ఛత్తీస్‌గఢ్  కు చెందిన నేతలకు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. 

కాంగ్రెస్ అవినీతికి నిల‌యం.. 

ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందని పీఎం విమ‌ర్శించారు. అవినీతి మద్యానికే పరిమితం కాలేదనీ,  రాష్ట్రంలో అవినీతి జరగని శాఖ ఏదీ మిగల‌లేద‌నీ, . జల్ జీవన్ మిషన్, పీఎం హౌసింగ్ స్కీమ్ ఇలా ఏ పథకాన్ని కూడా వదల్లేదంటూ ఆరోపించారు. అవినీతి కారణంగా వచ్చిన డబ్బుల కోసం జరిగిన గొడవల కారణంగా రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య ఫార్ములా (భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ దేవ్) విఫలమైందని ఆరోపించారు. మద్యపాన నిషేధం వంటి 2018 ఎన్నికల హామీలపై కాంగ్రెస్ మౌనం వహించడాన్ని మోడీ ప్రశ్నించారు. కేంద్రం చర్యల వల్ల తిరుగుబాటు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిందన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు.

ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి) ప్రభుత్వాన్ని మార్చాలని ప్ర‌జ‌లు పిలుపునిస్తున్నార‌ని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నం వింతగా ఉందనీ, సాధారణంగా ఒకరినొకరు విమర్శించుకునే వారు ఒక్కటవుతున్నారని విమ‌ర్శించారు. 'తప్పు చేస్తే వదిలిపెట్టం. నేను ధైర్యంగా చెబుతున్నాను ఎందుకంటే నాకు ఉన్నదంతా మీరు (ప్రజలు), ఈ దేశం ఇచ్చింది. తనపై కుట్రలు చేసి నా సమాధిని తవ్వడానికి ప్రయత్నిస్తున్న వారికి 'జో దర్ గయా వో మోదీ నహీం అని తెలియదు' అని ప్ర‌ధాని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం