కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తాత్యాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతు మద్దుతుకు కట్టుబడి ఉన్నామని Sonia Gandhi స్పష్టం చేశారు. రైతు సమస్యలతో పాటు నాగాలాండ్ ఘటన, ధరల పెరుగుదల వంటి అంశాలను సైతం ఆమె ప్రస్తావించారు.
కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఉధృత ఉద్యమంతో వెనక్కి తీసుకుంది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును పార్లమెంటలో ఆమోదించడంతో పాటు రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం రాష్ట్రపతి జారీ చేశారు. అయితే, రైతులు మాత్రం గిట్టుబాటు ధర సహా పలు డిమాండ్లు చేస్తూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ తాత్యాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మద్దతు ప్రకటించారు. తాము రైతు సమస్యలు తీర్చడం పట్ల కట్టుబడి ఉన్నామని తెలిపారు. Sonia Gandhi సీపీపీ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతు సమస్యలు, నాగాలాండ్‌లో పౌరుల హత్యలు, దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Also Read: Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా
undefined
దేశంతో నిత్యావసరాల ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గతేడాది మూడు వ్యవసాయ చట్టాలపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించిన మోడీ సర్కారు.. తాజా పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండానే రద్దు చేసిందని Sonia Gandhi అన్నారు. చట్టబద్దంగా పంట గిట్టుబాటు ధర MSPకి హామీని కోరడం, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాత కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, కేసుల ఎత్తివేయడం వంటి డిమాండ్లతో రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. రైతు డిమాండ్ల కు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. వివాదాస్పద సాగు చట్టా ల నేపథ్యంలో రైతులు గత పదమూడు నెలలుగా ఉద్యమం చేస్తున్నారనీ, ఇది వారి ధృఢ సంకల్పానికి నిదర్శనమనీ, వారిది న్యాయపోరాటం అని అన్నారు. రైతుల అంకిత భావం, క్రమశిక్షణ అహంకారపూరిత ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసిందని తెలిపారు. "వారి గొప్ప విజయానికి వారికి సెల్యూట్ చేద్దాం. గడిచిన పన్నెండు నెలల్లో 700 మందికి పైగా రైతులు అమరులయ్యారని గుర్తుంచుకోండి. వారి త్యాగాన్ని గౌరవిద్దాం" అని Sonia Gandhi అన్నారు.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?
ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పటి నుండి, మేము నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాన్ని సైతం లేవనెత్తుతున్నామని అన్నారు. అలాగే, చమురు ధరల పెరుగుదలను కూడా ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ.. ప్రజలపై ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మోపుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయని తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తలపై Sonia Gandhi మాట్లాడుతూ.. సరిహద్దుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఇప్పటి వరకు పార్లమెంటుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం దారుణమైన విషమని అన్నారు. టీకాలు అందించడంలో రికార్డులు సృష్టించామంటూ చెబుతున్న మోడీ సర్కారు.. ఈ డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ రెండు డోసులు అందిస్తామన్న లక్ష్యాన్ని అందుకోవడంలో వెనకబడిందన్నారు. నాగాలాండ్‌లో సైన్యం చేతిలో మరణించిన పౌరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘోరమైన విషాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని Sonia Gandhi డిమాండ్ చేశారు.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?