విద్యార్థి కస్టోడియల్ డెత్... రీ పోస్టుమార్టంకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు..

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 1:26 PM IST
Highlights

ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితులతో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెక్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితులు ప్రయత్నించారు.  కానీ, పోలీసులు వారిని పట్టుకోగా అతని స్నేహితుడు తప్పించుకు పోయాడు. police మణికందన్ ను స్టేషన్ కు తరలించారు. 

తమిళనాడు : తమిళనాడులో కస్టోడియల్ డెత్ కలకలం రేపుతోంది. పోలీస్ కస్టడీలో రెండు రోజులున్న ఓ విద్యార్థి ఇంటికి వెళ్లిన మరుసటి రోజే చనిపోవడంతో తీవ్ర నిరసనలు వ్యక్తం అవతున్నాయి. తల్లిదండ్రులు, నెటిజన్లు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మండిపడుతున్నారు. 

Custodial deaths ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న 20 ఏళ్ల విద్యార్థి L Manikandan పోలీస్ కస్టడీ నుంచి విడుదలైన మరుసటి రోజే మృతి చెందడం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీస్ కస్టోడియల్ మరణం అంటూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాస్ హైకోర్టు మణికందన్ మృతదేహానికి తిరిగి Postmortem చేయాలని ఆదేశించింది.

Omicron Effect: జనవరి 5 వరకు 144సెక్షన్ అమలు.. యోగి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

వివరాల్లోకి వెళితే..  ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితులతో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెక్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితులు ప్రయత్నించారు.  కానీ, పోలీసులు వారిని పట్టుకోగా అతని స్నేహితుడు తప్పించుకు పోయాడు. police మణికందన్ ను స్టేషన్ కు తరలించారు. 

ఆ తర్వాత అతని తల్లి రామలక్ష్మికి సమాచారం అందించగా..మణికందన్ parents పోలీస్ స్టేషన్కు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు.  అయితే మరుసటి రోజు  ఉదయం మణికందన్ స్పృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు  స్థానిక ఆస్పత్రికి తరలించారు.  అయితే అప్పటికే మణికందన్ dead అయ్యాడు. 

మణికందన్ కు పోస్టుమార్టం చేయించిన పోలీసులు  dead bodyని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తన కొడుకు పోలీసులు స్టేషన్లో హింసించడం వల్ల  మరణించాడని  తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీస్ అధికారులు చెప్పడంతో నిరసన విరమించారు.

స్నేహితుడిని చంపి మొండాన్ని ఇంట్లో దాచాడు.. ఆ తలను ఏం చేశాడంటే..

సోమవారం పోలీసులు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు  హింసించ లేదని  పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వెహికల్ చెక్ అప్ లో భాగంగా పట్టుకున్నామని తన స్నేహితుడు కేసుల్లో ఉన్నాడని తెలిపారు.

పోలీసులు హింసించారని, ఆ కారణంగా తమ కొడుకు చనిపోయాడని మణికందన్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  దీంతో మణికందన్ మృతదేహానికి  రీ పోస్టుమార్టం చేయాలని  కోర్టు ఆదేశించింది.

అయితే ఈ ఘటన పై social mediaలో చర్చ జరుగుతోంది.  పోలీస్ దౌర్జన్యం, కస్టోడియల్ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

click me!