Army chopper crash: ఊటీలో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. అందులో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్!

Published : Dec 08, 2021, 01:40 PM ISTUpdated : Dec 08, 2021, 02:41 PM IST
Army chopper crash: ఊటీలో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. అందులో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్!

సారాంశం

తమిళనాడులోని (Tamil Nadu) ఊటీ సమీపంలో కునూరు వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ కూలింది (army chopper crashes). ఈ హెలికాఫ్టర్‌లో సీనియర్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

తమిళనాడులోని (Tamil Nadu) ఊటీ సమీపంలో కునూరు (Coonoor) వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ కూలింది (army chopper crashes). ఈ హెలికాఫ్టర్‌లో సీనియర్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో 14 మంది ఉన్నట్టుగా సమాచారం.హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌, మరికొందరు సీనియర్ అధికారులు ఉన్నట్టుగా సమాచారం. అయితే దీనిపై అధికారికి సమాచారం రావాల్సి ఉంది. 

తమిళనాడులోని కోయంబత్తూరు-సూలూరు మధ్య  Mi సిరీస్ హెలికాఫ్టర్ కుప్పకూలినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఛాపర్‌లో బిపిన్ రావత్‌తో పాటు ఆయన సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా చెబుతున్నారు. సమీపంలోని ఆర్మీ శిబిరాల నుంచి అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.గాయపడిన పలువురిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలను కూడా వెలికి తీశారు. అయితే వాటిని గుర్తించాల్సి ఉంది. 

ఇక, హెలికాఫ్టర్ కూలిన ఘటనను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ధ్రువీకరించింది. ఈ ఘటనకు గల కారణాలపై ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ విచారణకు ఆదేశించించింది. అయితే హెలికాప్టర్ కూలడానికి గల కారణాలపై మాత్రం స్పష్టత రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఇలా జరిగిందా..? ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

హెలికాప్టర్ లో రావత్ తో పాటు ఆయన భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరా తీశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించినట్లు నీలగిరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కాగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

బిపిన్ రావత్ ఆచూకీ లభించడం లేదు. ఆయన తీవ్రంగా గాయపడినట్లు భావిస్తున్నారు. క్షతగాత్రులను ముగ్గురిని విల్లింగ్టన్ బేస్ కు తరలించారు. కూనూరు నీలగిరి కొండల్లో ఈ హెలికాప్టర్ కాలింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. కోయంబత్తూరోలని సూలూరు నుంచి వెల్లింగ్టన్ బేస్ కు హెలికాప్టర్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదంపై రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ప్రమాదానికి గల కారణాలపై తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. రావత్ కూతురు కూడా హెలికాప్టల్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం రూఢీ కావడం లేదు. ప్రమాద స్థలాన్ని సహాయ బృందాలు జల్లెడ పడుతున్నాయి. మృతదేహాలు గుర్తు పట్టరాని విధంగా దగ్ధమయ్యాయి. కొందరి దేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 

వెల్లింగ్టన్ బేస్ చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ప్రమాదం జరిగింది. 2009లో రావత్ డెఫెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. ప్రమాద స్థలంలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట వర్షాలు కురుస్తున్నాయి. అయితే, సాంకేతిక లోపమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణం దర్యాప్తులో తేలాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?