మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం

Siva Kodati |  
Published : Dec 14, 2021, 09:55 PM IST
మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం

సారాంశం

బెంగాల్ సీఎం (west bengal) తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీకి (mamata banerjee) సోనియా గాంధీ (sonia gandhi) షాకిచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ భేటీకి మమత పార్టీకి ఆహ్వానం అందలేదు. 

బెంగాల్ సీఎం (west bengal) తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీకి (mamata banerjee) సోనియా గాంధీ (sonia gandhi) షాకిచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ భేటీకి మమత పార్టీకి ఆహ్వానం అందలేదు. ఎన్సీపీ‌, డీఎంకే, శివసేన, సీపీఎం నేతలతో తన నివాసంలో భేటీ అయిన సోనియా.. 12 మంది రాజ్యసభ ఎంపీలను (mps suspension) సస్పెండ్‌ చేసిన వ్యవహారంలో పార్లమెంట్‌లో (parliament winter session) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ భేటీకి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు శివసేన నేత సంజయ్‌ రౌత్‌, డీఎంకే నేత టీఆర్‌ బాలు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుతో శరద్‌ పవార్‌ మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా చూడాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించినట్టు సమాచారం. 

Also Read:కాంగ్రెస్ విఫలం.. అందరి చూపు దీదీ వైపే.. విపక్ష కూటమి బాధ్యత ఆమెదే: టీఎంసీ

కాగా.. గోవా, మేఘాలయ, బీహార్, హర్యానా తదితర రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అవతరించేందుకు టీఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. టీఎంసీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువ మంది చేరారు.  ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావిస్తోంది.  ఈ మేరకు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోవాలని టీఎంసీ భావిస్తోంది.  కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలవడం తప్పనిసరి అని ప్రశ్నించిన సమయంలో కూడా ఆమె కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలను ఏకం చేసేందుకు మమత బెనర్జీ ప్రయత్నాలపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

మమత బెనర్జీ ఇటీవల ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. 2008 ముంబై ఉగ్రదాడిలో పోరాడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ తుకారాం ఓంబాలే స్మారక చిహ్నం వద్ద బెంగాల్ సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి రావాలని మమత బెనర్జీ కోరారు.  ఫాసిస్ట్ Bjp  ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె కోరారు.  UPAది ముగిసిన చరిత్రగా పేర్కొన్నారు.యూపీఏ ఇప్పుడు ఉనికిలో లేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరో వైపు టీఎంసీతో తమకు పాత అనుబంధం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం