గంగానది శుభ్రంగా లేదనే యోగి సాన్నం చేయలేదు - అఖిలేష్ యాదవ్

By team teluguFirst Published Dec 14, 2021, 8:07 PM IST
Highlights

గంగానది మురికి కూపంగా ఉందని తెలిసే సీఎం యోగి ఆదిత్యనాథ్ నదిలో స్నానం చేయలేదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు వృథా అయ్యాయని ఆరోపించారు.

గంగాన‌ది శుభ్రంగా లేద‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు తెలుస‌ని అందుకే ఆయ‌న న‌దిలో మునిగి స్నానం చేయ‌లేద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో యూపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు పెరుతుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. గంగా ప్రక్షాళనకు బీజేపీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా గంగా న‌ది శుభ్రం కాలేద‌ని, అది ఇప్ప‌టికీ మురికి కూపంగా ఉంద‌ని ఆరోపించారు. ఈ విష‌యం సీఎంకు తెలుస‌ని అన్నారు. అందుకే కాశీ విశ్వ‌నాత్ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ సమ‌యంలో గంగాన‌ది ద‌గ్గ‌రికి ప్ర‌ధాని తో పాటు వెళ్లి న‌దిలో స్నానం చేయ‌లేద‌ని ఆరోపించారు. 

తేజస్వీ యాదవ్ పెళ్లిపై దుమారం : పేరు మార్చుకున్న లాలూ కొత్త కోడలు.. ఏంటంటే..?
విశ్వ‌నాత్ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న తన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. దశాబ్దాలుగా దేశ ఆధ్యాత్మిక రాజధానిపై పేరుకుపోయిన అపరిశుభ్రత ను తాము తొల‌గించాల‌ని అన్నారు. 
వచ్చే ఏడాది ఎన్నిక‌లు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో స‌మాజ్ వాదీ, బీజేపీ రెండు ప్ర‌ధాన పార్టీలు. ఈ నేప‌థ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని సంత‌రించుకున్నాయి. గ‌తంలో వారణాసిలో ప్రజలు చనిపోతున్నారంటూ ప్రధాని నరేంద్రపై అఖిలేష్ యాద‌వ్ విమ‌ర్శ‌లు చేశారు.

click me!