
AK Antony: కాంగ్రెస్ సీనియర్ నేత అరక్కపరమ్‌బిల్ కురియన్ ఆంటోనీ.. అలియాస్ ఏకే ఆంటోనీ (81) రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏప్రిల్‌తో ఆంటోనీ రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. తనను మళ్లీ రాజ్యసభకు పంపించవద్దని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలియజేసినట్టు ఆంటోనీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు.
రాజ్యసభలో కాంగ్రెస్ తరుఫున నేతృత్వం వహించే అవకాశం కల్పించినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 2 తో రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోందనీ..దీంతో తాను రాజకీయాలను స్వస్తి చెప్పనని తెలిపారు. అలాగే ఢిల్లీలో కూడా ఉండనని, తిరువంతనపురం వెళ్లిపోతున్నానని పేర్కొన్నారు.
ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గొప్ప నేత.. అటు అధిష్టానంతో.. ఇటు పార్టీ నేతలతో స్నేహశీలిగా ఉండే వాడు. ఆయన రాజకీయ ప్రస్థానంతో ఎన్నో అటుపోట్లలను ఎదుర్కొన్నారు. తన పొలిటికల్ కెరీర్‌ను కాంగ్రెస్ నుంచే ప్రారంభించారు. కాంగ్రెస్‌తో ముగించనున్నారు.
ఏకే ఆంటోని 1970లలో విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తన పొలిటికల్ కెరీర్‌ను కాంగ్రెస్ నుంచే ప్రారంభించారు. కాంగ్రెస్‌తో ముగించనున్నారు. ఆంటోనీ కాంగ్రెస్ అత్యంత నిజాయితీపరుడైన, నాయకులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు, అతనికి 'సెయింట్ ఆంటోనీ ఆఫ్ కాంగ్రెస్' అనే పేరు వచ్చింది. అతను సోనియా గాంధీకి అత్యంత విశ్వసనీయమైన వారిలో ఆంటోని ఒకరు. ఆయనకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఆయనకు గాంధీ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి.
ఆంటోనీ 1970లో కేరళ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, 1977లో కేవలం 37 యేండ్లకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రికార్డుల్లోకెక్కారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సొంతంగా కాంగ్రెస్ (ఏ) అన్న పార్టీనే స్థాపించారు. ఆ తర్వాత దీనిని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఎమ్మెల్యే అయిన ఆయన 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కేరళ విభాగానికి చీఫ్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత 2006 నుండి 2014 వరకు దేశంలో ఏ రక్షణ మంత్రి చేయని సుదీర్ఘ కాలంతో సహా మూడు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అతను ఐదు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా, రాహుల్‌తో కలిసి పనిచేసిన ఘనత ఆంటోనీకి దక్కింది.
1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక తర్వాత, కేరళలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ (యు) వర్గానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1978 ఉప ఎన్నికల్లో ఇందిరాగాంధీకి పార్టీ మద్దతు ఇచ్చినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఎమర్జెన్సీని ఉపసంహరించుకోవాలని ఆంథోనీ గాంధీని కూడా కోరారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఆంటోనీ కాంగ్రెస్ (A) అనే తన సొంత కాంగ్రెస్ వర్గాన్ని ప్రారంభించాడు, అది తర్వాత కాంగ్రెస్ లో కలిపివేశారు. చేరింది కొచ్చిలో జరిగిన విలీన కార్యక్రమానికి ఇందిరా గాంధీ హాజరయ్యారు.
అధిష్ఠానం సూచనలతో 1984 నుంచి తన రాజకీయాలకు ఢిల్లీకి కేంద్రంగా మార్చుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియశీలకంగా మారారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కాలం పాటు సభ్యునిగా కొనసాగారు. 2004 నుంచి జాతీయ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం తర్వాత.. ఆంటోనీ పార్టీ అంతర్గత సమస్యలపై బహిరంగంగా మౌనం వహించారు. అంతర్జాతీయ అంశాలతో పాటు, పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఆయన మాట్లాడలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న విషయం తెరపైకి రావడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారందర్నీ జీ 23 అని పిలుస్తారు. అప్పుడు కూడా ఆంటోనీ అధిష్ఠానానికి విధేయంగానే ఉన్నారు. ఆయనతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులు, పార్టీని వీడిన మాజీ సభ్యులు కూడా ఆయనను "డై-హార్డ్ కాంగ్రెసీ"గా అభివర్ణిస్తారు.