UP Assembly elections 2022: ఈవీఎంల తరలింపుపై ఈసీ సీరియ‌స్.. అధికారిపై వేటు!

Published : Mar 10, 2022, 04:45 AM IST
UP Assembly elections 2022: ఈవీఎంల తరలింపుపై ఈసీ సీరియ‌స్.. అధికారిపై వేటు!

సారాంశం

UP Assembly elections 2022:  యూపీలో ఈవీఎంల అక్ర‌మ త‌ర‌లింపు క‌ల‌క‌లం రేపుతోంది. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందుఈవీఎంల‌ను దొంగ‌లిస్తున్నార‌ని అఖిలేశ్‌ బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో స‌ద‌రు అధికారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు కేంద్రం ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.   

UP Assembly elections 2022: ఎంతో ఉత్కంఠ‌గా సాగిన ఐదు రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉద‌యం 8 గంట‌ల నుంచి  690 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న‌ది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు ఈవీఎం మిష‌న్ల‌ను అక్ర‌మంగా త‌ర‌లించ‌డం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌ల‌క‌లం రేపుతోంది.  ఈ విష‌యాన్ని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చాలా సిరియస్ గా తీసుకున్నారు. ఈవీఎంల‌ను దొంగ‌లిస్తున్నార‌ని అఖిలేశ్‌ బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండానే, నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఈవీఎంల‌ను త‌ర‌లిస్తున్నార‌ని, ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారణాసి కలెక్టర్ ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయంపై ఈసీ దృష్టి పెట్టాల‌ని కోరారు. అఖిలేశ్ ఆరోపణలను నిజం చేస్తూ బుధవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు అయ్యాడు.  అఖిలేశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా స్పందించింది. 

ఆ వీడియోలో వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపు  వాస్తవమేనని, దానిని తాను అంగీకరిస్తానని అన్నారు. ఈ వీడియో కూడా కలకలం రేపింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెంటనే రంగంలోకి దిగింది. వారాణాసి ఏడీఎంపై చర్యలు తీసుకోవాలంటూ  ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్  శర్మ మాట్లాడుతూ.. ఈవీఎంలను ఈ రోజు తరలించాల్సి ఉందని, కానీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏడీఎం ఎన్‌కే సింగ్‌ తరలించారని చెప్పారు. 

వార‌ణాసి అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్‌.కే. సింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ  ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ వివాదంపై వార‌ణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశ‌ల్ రాజ్ శ‌ర్మ మాట్లాడుతూ.. నేటి ఉద‌యానికి ఈవీఎంలు త‌ర‌లించాల్సి ఉంది. కానీ.. ఈ స‌స్పెండ్ అయిన అధికారి.. ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా రాత్రే ఈవీఎంల‌ను త‌ర‌లించారు అంటూ పేర్కొన్నారు. ఈవీఎంల‌ను త‌ర‌లిస్తున్నార‌ని కొంద‌రు ఆరోపిస్తున్నార‌ని, అవి ట్రైనింగ్‌కు సంబంధించినవ‌ని, వాటి ఆపి… త‌ర‌లిస్తున్నార‌ని రాజ‌కీయ నేత‌లు ఆరోపిస్తున్నార‌ని, స‌ద‌రు ఉద్యోగిని  సస్పెండ్ చేసిన‌ట్టు పేర్కొన్నారు. 

అలాగే... బీజేపీ ఓడిపోయే ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ చాలా సేపు సాగింద‌నీ, అలాగే ఈ ప్రాంతాల్లో కౌంటింగ్ కూడా లేట్ గా ప్రారంభించాల‌ని అధికారుల‌కు ఆదేశించినట్టు ఆరోప‌ణ‌లు న్నాయి.  ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకునే క్ర‌మంలో యూపీ ఎన్నిక‌లే చివ‌రి అస్త్ర‌మ‌ని, వీటి త‌ర్వాత ఇక‌.. ఎవ‌రికి సంబంధించిన స్వేచ్ఛ కోసం వారు పోరాడాల్సిందేన‌ని అన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu