దీపావళి సంబురాలపై ఆంక్షలు.. క్రాకర్స్‌పై కలకత్తా హైకోర్టు బ్యాన్

Published : Oct 29, 2021, 05:20 PM IST
దీపావళి సంబురాలపై ఆంక్షలు.. క్రాకర్స్‌పై కలకత్తా హైకోర్టు బ్యాన్

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లో దీపావళి వేడుకలపై ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా, కాలుష్యం కారణంగా రాష్ట్రంలో అన్ని రకాల ఫైర్ క్రాకర్స్ కాల్చడం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో దివాళి సెలబ్రేషన్స్ అతి సాధారణంగా జరగనున్నాయి.  

కోల్‌కతా: దీపావళి అంటే టపాసులు పేల్చడం, దీపాలు వెలిగించడం తప్పనిసరిగా చేస్తుంటారు. టపాసులు కాల్చి కుర్రకారు, పిల్లలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటారు. కానీ, అటు వాయు కాలుష్యం.. కరోనా ముప్పు ఈ సంబురాలకు గండికొడుతున్నాయి. West Bengalలో Diwali వేడుకలపై ఆంక్షలు అమలవుతున్నాయి. Calcutta High Court క్రాకర్స్‌పై సంపూర్ణ నిషేధం విధించింది. కనీసం Green Crackers కూడా కాల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

కాళీ పూజా, దివాలి, ఛత్త్ పూజా, క్రిస్మస్ పండుగలలో గ్రీన్ క్రాకర్స్ సహా బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించాలనే పిటిషన్ కలకత్తా హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్ విచారిస్తూ ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకు ముందు బెంగాల్ కాలుష్య నియంత్రణ బోర్డు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కాల్చడానికి అనుమతించింది. ఛత్త్ పూజా కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. నూతన సంవత్సర వేడుకల కోసం 35 నిమిషాలు బాణాసంచా కాల్చడానికి వెసులుబాటు ఇచ్చింది. కానీ, తాజాగా హైకోర్టు ఆదేశాలు ఆ మినహాయింపులూ అటకెక్కాయి.

Also Read: కరోనా థర్డ్ వేవ్: కేసులు పెరగడంతో ఆ పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్

ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందని, అందరి ప్రయోజనాల దృష్ట్యా కరోనా నేపథ్యంలో అన్ని రకాల బాణాసంచా పేల్చడాన్ని Ban చేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. నిజానికి కాలుష్యం కారణంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి చాలా మంది నిపుణులు సజెస్ట్ చేస్తుంటారు. కానీ, ఈ రెండునూ వేరుచేసి గ్రీన్ క్రాకర్స్‌ను కచ్చితంగా గుర్తుపట్టే పరికరాలు పోలీసుల దగ్గర లేవని హైకోర్టు గుర్తుచేసింది. అందుకే అన్ని రకాల బాణాసంచా క్రయవిక్రయాలు, పేల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు వివరించింది.

ఈ ఆదేశాలతోపాటు పోలీసులకూ సూచనలు చేసింది. రాష్ట్రంలో ఫైర్ క్రాకర్స్ కాల్చడం, అమ్మకాలపై కన్నేయాలని, ఒకవేళ అవి చోటుచేసుకుంటే వాటిని అడ్డుకోవాలని తెలిపింది.

దీపావళికి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించడంపై ముందు నుంచి కొన్నివర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం దీపావళి పండుగలకే బాణాసంచాను నిషేధిస్తున్నాయని ఆరోపించాయి. కానీ, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ పరమావధి అని, అందుకు మతాలకు అతీతంగా అన్ని వేడుకలపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు పలుసార్లు పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలతోనే రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

West Bengalలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో కేసులు పెరిగాయి. ముఖ్యంగా సోనార్‌పూర్ మున్సిపాలిటీలో ఇవి అధికంగా రిపోర్ట్ అయ్యాయి. ఈ ఏరియా రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏరియాలో కఠిన లాక్‌డౌన్ విధించింది. ఇప్పటి వరకు సోనార్‌పూర్‌లో 19 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు గుర్తించారు. 

Also Read: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

బెంగాల్‌లో వరుసగా రెండు రోజులుగా 800లకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఇక్కడ 805 కొత్త కేసులు నమోదవ్వగా, మంగళవారం 806 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంతకు ముందు రెండు రోజులు సుమారు వెయ్యి కేసులు నమోదయ్యాయి. మంగళవారానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 15,88,066కి చేరాయి. కొత్తగా 15 మంది కరోనాతో మరణించగా మహమ్మారి కారణంగా మరణించినవారి మొత్తం సంఖ్య 19,081కి పెరిగాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu