
రామనవమి సందర్భంగా బీహార్‌లోని ససారన్, బీహార్ షరీఫ్‌లలో జరిగిన మత హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించడానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో ఆయన మాట్లాడారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కు సాయం చేయడానికి అదనపు కేంద్ర సాయుధ బలగాలను బీహార్‌కు పంపాలని షా తరువాత నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర బలగాలను పంపుతామని చెప్పారు.
రెండు సమస్యాత్మక జిల్లాల్లో 106 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నలంద జిల్లా కేంద్రమైన బీహార్ షరీఫ్‌లో సీఆర్ పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఇందులో రోహ్తస్ లో 26 మందిని, నలందలో 80 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం.. శనివారం సాయంత్రం నలందలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. అలాగే రోహ్తాస్‌లో కూడా బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు గాయపడ్డారు.
లోయలో పడిన బస్సు: 22 మందికి తీవ్ర గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
దీంతో పాటు ససారమ్‌లోని ఓ ఇంట్లో బాంబు సంభవించింది. ఘటనా స్థలం నుంచి దుండగులకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుపై సమాచారం అందిన వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోందని బీహార్ పోలీసులు వెల్లడించారు. ప్రాథమికంగా ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని చెప్పారు. ఈ పేలుడు అనంతరం పోలీసు బృందం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ , పారా మిలటరీ బలగాలు శనివారం ససారంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
నడిరోడ్డులో ఢిల్లీ న్యాయవాదిపై కాల్పులు.. ఆందోళనకు పిలుపు..
కాగా.. ఈ అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ జారీ చేయడం వల్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దయ్యింది. వాస్తవానికి ఆయన పాట్నాలోని సశాస్త్ర సీమా బల్ సరిహద్దు ప్రధాన కార్యాలయానికి రావాల్సి ఉంది. దీనిపై ఎస్ఎస్ బీ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘అనివార్య కారణాల వల్ల ఎస్‌ఎస్‌బీ సరిహద్దు ప్రధాన కార్యాలయానికి కేంద్ర మంత్రి రావడం లేదు.’’ అని పేర్కొంది. ఆయన పాట్నాకు వచ్చి ఆ కేంద్ర పారామిలటరీ దళం కొత్త భవనానికి శంకుస్థాపన చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. దీంతో పాటు ఆయన రాష్ట్ర రాజధానిలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించాలని నిర్ణయించినా.. ఆ కార్యక్రమం కూడా రద్దు అయ్యింది.