పెళ్లికి ఒప్పుకోలేదని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్‌తో కొట్టి హత్య...

Published : Jul 28, 2023, 02:51 PM IST
పెళ్లికి ఒప్పుకోలేదని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్‌తో కొట్టి హత్య...

సారాంశం

పెళ్లికి ఒప్పుకోలేదని ఓ కాలేజీ విద్యార్థినిపై ఓ వ్యక్తి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. రాడ్డుతో ఆమె తలమీద కొట్టి హతమార్చాడు. 

ఢిల్లీ : ఢిల్లీలో మహిళలు, విద్యార్థినుల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. శుక్రవారం ఢిల్లీ, మాళవీయా నగర్‌లో ఓ కాలేజీ బాలికపై ఓ వ్యక్తి రాడ్‌తో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీ విద్యార్థిని. ఆమెపై కాలేజీ ఆవరణ బయట దాడి జరిగింది.

బాధితురాలు తన వివాహ ప్రతిపాదనను నిరాకరించిందని, దీంతో ఆమెను చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్), సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

విమానంలో యువ మహిళా డాక్టర్ పై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. పక్కనే కూర్చొని, అనుచితంగా తాకుతూ..

బాధితురాలి మృతదేహం సమీపంలో ఆమెమీద దాడికి ఉపయోగించిన రాడ్‌ను పోలీసులు కనుగొన్నారు. ఆమె తలపై గాయాలు ఉన్నాయి. "దక్షిణ ఢిల్లీలోని మాళవీయ నగర్‌లోని అరబిందో కళాశాల సమీపంలో 25 ఏళ్ల యువతి మృతదేహం ఉందని మాకు సమాచారం వచ్చింది. యువతి మృతదేహం సమీపంలో ఇనుప రాడ్ దొరికింది. ప్రాథమిక విచారణ ప్రకారం, బాలికపై రాడ్‌తో దాడి చేశారు. మేము వెళ్లేసరికి ఆమె తల నుండి రక్తం కారుతుంది. ఈ ఘటన మీద తదుపరి విచారణ పురోగతిలో ఉంది" అని పోలీసులు తెలిపారు.

"ఈ సంఘటన పార్క్ లోపల జరిగింది. మృతురాలు కళాశాల విద్యార్థిని. ఆమె తన స్నేహితుడితో కలిసి పార్కుకు వచ్చింది. మృతురాలి తలపై గాయాలు ఉన్నాయి" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?