కొత్త సంవత్సం గుడ్ న్యూస్ మోసుకువస్తోంది. కర్ణాటకలో తొమ్మిది లాంగ్ వీకెండ్ ను ఉద్యోగులను ఉత్సాహపరచనున్నాయి. ఆ వివరాలు ఇవే..
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2024కు గాను 25 ప్రభుత్వ సెలవులతో కూడిన జాబితాను ప్రకటించింది. వీటితో పాటు సెకండ్ సాటర్ డేలు, ఆదివారాల్లో పండుగలు రావడంతో.. మూడు అదనపు సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా, వీటిలో తొమ్మిది సెలవులు సోమవారాలు లేదా శుక్రవారాలు ఉండడంతో మొత్తంగా కలిసి.. ఈ లిస్ట్ ప్రకారం సంవత్సరం 9 లాంగ్ వీకెండ్ లు రానున్నాయి. దీంతో వారానికి మూడు లేదా నాలుగు రోజుల సెలవులతో 2024 ఉద్యోగులకు శుభవార్తను మోసుకొస్తోంది.
కొత్త సంవత్సరంలో
జనవరి 15 సంక్రాంతితో పాటు
ఉగాది,
సెప్టెంబర్ 16ఈద్ మిలాదన్,
నవంబర్ 18న కనకదాస జయంతి
లాంటి సెలవులు సోమవారం వస్తున్నాయి. శని, ఆదివారాలకు పొడగింపుగా ఈ సెలవులు ఉండనున్నాయి.
undefined
ఇక జనవరి 26న రిపబ్లిక్ డే,
మార్చి 8న మహా శివరాత్రి,
మార్చి 29న గుడ్ ఫ్రైడే,
మే 10న అక్షయ తృతీయ,
అక్టోబర్ 11న ఆయుధ పూజ,
నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవ వేడుకలు
ఇవన్నీ శుక్రవారం రానున్నాయి. శని, ఆదివారాల వీకెండ్ ప్రారంభానికి ముందే ఈ సెలవులు మొదలవుతాయి.
వీటితో పాటు ఏప్రిల్ 21న మహావీర్ జయంతి,
అక్టోబర్ 12న విజయదశమి లు సెకండ్ సాటర్ డే రోజున వస్తున్నాయి.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఆదివారంనాడు వస్తుంది.
కొడగు జిల్లాలో సెప్టెంబరు 3న కైల్ ముహూర్తం,
అక్టోబర్ 17న తులా సంక్రమణ,
డిసెంబర్ 14న హుత్తరి నాడు ప్రత్యేకంగా సెలవులు ప్రకటించనున్నారు.