ఇప్పటికే 400 మంది మృతి.. మా సిబ్బంది కోసం 10 లక్షల డోసులివ్వండి: కేంద్రానికి కోల్ ఇండియా లేఖ

Siva Kodati |  
Published : Jun 09, 2021, 04:30 PM IST
ఇప్పటికే 400 మంది మృతి.. మా సిబ్బంది కోసం 10 లక్షల డోసులివ్వండి: కేంద్రానికి కోల్ ఇండియా లేఖ

సారాంశం

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్.. తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లను ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే 400 మంది సిబ్బంది కరోనా బారిన పడి చనిపోయారని ఆవేదన  వ్యక్తం చేసింది

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్.. తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లను ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే 400 మంది సిబ్బంది కరోనా బారిన పడి చనిపోయారని ఆవేదన  వ్యక్తం చేసింది. 2.59 లక్షల మంది ఉద్యోగులున్న తమ సంస్థలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేసేందుకు పది లక్షల డోసులను కేటాయించాల్సిందిగా లేఖలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ఇప్పటిదాకా కేవలం పావు వంతు మంది ఉద్యోగులకే టీకాలు అందాయని పేర్కొంది. సంఖ్యా పరంగా 64 వేల మంది టీకాలు వేసుకున్నారని చెప్పింది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, మరింత నష్టం జరగకుండా ఉండేందుకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించాలని భావిస్తున్నట్లు అఖిల భారతీయ ఖదన్ మజ్దూర్ సంఘ్ సుధీర్ ఘుర్దే అన్నారు.

Also Read:కరోనా ఉచిత వ్యాక్సినేషన్: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

కాగా, కరోనా లాక్ డౌన్ సమయంలోనూ బొగ్గు గని ఉద్యోగులు, కార్మికులు రేయింబవళ్లు పనిచేశారు. విద్యుదుత్పత్తిలో కీలకమైన ఇంధనం బొగ్గును నిరంతరాయంగా వెలికి తీశారు. సెకండ్ వేవ్‌లో మహమ్మారి కారణంగా మరణాలు పెరిగినా లెక్క చేయకుండా విధులు నిర్వర్తించారు

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం