లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను పరామర్శించిన సీఎం నితీష్ కుమార్.. ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా..

By team telugu  |  First Published Jul 6, 2022, 4:36 PM IST

అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ ను ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. 


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆసుపత్రిలో క‌లుసుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమించడంతో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, తదుపరి వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నట్లు ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు.

తీవ్ర దుమారం రేపుతున్న టీఎంసీ ఎంపీ మోయిత్రా కామెంట్స్.. పోలీసు కేసు నమోదు..

Latest Videos

undefined

‘‘ ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. నాన్న మూత్రపిండాలు, గుండె సమస్యల గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు. వీటికి సంబంధించిన చికిత్స ఢిల్లీలో జ‌రుగుతోంది. ఆ వైద్యులకు నాన్న హెల్త్ హిస్ట‌రీ మొత్తం తెలుసు. అందుకే మేము ఆయ‌న‌ను ఢిల్లీకి తెలుసుకెళ్తున్నాం.’’ అని ప‌రాస్ హాస్పిట‌ల్ బ‌య‌ట తేజ‌స్వీ యాద‌వ్ మీడియాతో తెలిపారు. ఆరోగ్య ప‌రిస్థితి మ‌రీ విష‌మిస్తే త‌న తండ్రిని సింగ‌పూర్ కు కూడా తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. 

Karnataka Rains: క‌ర్నాట‌క‌లో భారీ వ‌ర్షాలు.. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ సీఎం ఆదేశాలు

‘‘ పరిస్థితి మమ్మల్ని సింగపూర్ కు తీసుకెళ్లాలని కోరితే, మేము అలాగే చేస్తాం. రాజకీయాల్లో ఉన్న వారంతా ఇతర పార్టీల్లో ఉన్నవారు, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ఫోన్ చేశారు. ’’ అని తేజ‌స్వీ యాద‌వ్ తెలిపారు. 

This is something which the younger generation of politicians needs to learn from their seniors.

The current lot act like sworn enemies, the bonhomie is missing, which is so essential to find solutions to difficult issues.

CM Nitish Kumar checking out the health of Lalu Yadav. pic.twitter.com/UHHcmiTpFj

— Maanmohan Singh Pahujaa (@msgpahujaa)

 

లాలూ ఆరోగ్యంపై ఆరా తీయడానికి బీహార్ సీఎం నితీశ్ ఫోన్ చేసినప్పుడు.. ఆయ‌న భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా మాట్లాడారు. పరాస్ ఆసుపత్రి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ హాస్పిటల్ లో చేరిన త‌రువాత ఆయ‌న ఆరోగ్యం కాస్తా మెరుగుప‌డింది. కానీ త‌దుప‌రి చికిత్స కోసం ఆయ‌నను ఇంకా ఢిల్లీకి త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని అన్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.  కాగా ఆయ‌న ఇటీవ‌ల మెట్లపై నుంచి జారిప‌డ్డారు. దీంతో ఆయ‌న కుడి భుజంపై గాయాలు అయ్యాయి. 

మూసేవాలకు పట్టిన గతే నీకు పడుతుంది.. సల్మాన్ ఖాన్ లాయర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ

లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేర‌కు తేజస్వి యాదవ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆర్జేడీ అధినేత త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న దాణా కుంభకోణం కేసులో బెయిల్ పై బయట ఉన్నారు.

click me!