ముగిసిన సీఎం కేసీఆర్  తొలిదశ  ప్రచారం..

By Rajesh Karampoori  |  First Published Oct 19, 2023, 5:54 AM IST

గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు రెండు చొప్పున బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. అక్టోబర్ 15న మేనిఫెస్టో ప్రకటన తర్వాత నుంచి  బీఆర్‌ఎస్ అభ్యర్థుల సమావేశం నిర్వహించి బీ-ఫారాలు జారీ చేయడమే కాకుండా గత నాలుగు రోజులుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటన చేశారు.


గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు రెండు చొప్పున బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. అక్టోబర్ 15న మేనిఫెస్టో ప్రకటన తర్వాత హుస్నాబాద్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ ఎన్నికల ప్రచారం బుధవారం జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో కొనసాగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల సమావేశం నిర్వహించి బీ-ఫారాలు జారీ చేయడమే కాకుండా గత నాలుగు రోజులుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటన చేశారు.  

ఈ పర్యటనలో బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. కాంగ్రెస్,బీజేపీల వైఖరిని ఎండ కట్టారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తు చేస్తున్నారు. విపక్షాలు అధికారంలోకి వస్తే.. పరిణామాలు వేరేలా ఉంటాయని నచ్చజేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేసినప్పటికీ, ఎన్నికల వ్యూహాలను పున: మూల్యాంకనం చేయడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉన్న పార్టీ అభ్యర్థులతో సమన్వయం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు

Latest Videos

ఇలా తన తొలి దశ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గ పర్యటనలకు విరామం ఇవ్వనున్నారు. దసరా పండుగ వరకు హైదరాబాద్‌లోనే ఉండి అక్టోబర్ 26 నుంచి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి పర్యటనకు విశేష స్పందన లభిస్తున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.

అక్టోబరు 26 నుంచి నవంబర్ 9 వరకు రోజుకు కనీసం రెండు మూడు నియోజకవర్గాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తూనే ఉంటారు. నవంబర్ 9న సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో చంద్రశేఖర్ రావు నామినేషన్ దాఖలు చేసి, అదే రోజు కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా, మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉప్పల్‌ ఇన్‌ఛార్జ్‌ రాగిడి లక్ష్మా రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు.

click me!