ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ₹ 1.5 కోట్లు.. మహారాష్ట్ర పోలీస్ పై సస్పెన్షన్ వేటు.. 

By Rajesh Karampoori  |  First Published Oct 18, 2023, 11:12 PM IST

మహారాష్ట్రలోని పింప్రీ చించ్‌వాడ్‌లోని పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండేకు కోటీశ్వరుడయ్యానన్న ఆనందం కొద్దిసేపటికే మిగిలింది. అతను ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్ 11 నుండి రూ. 1.5 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి  రావడంతో ఆ పోలీసు అధికారిపై విచారణ ప్రారంభించారు. 


ఇటీవల ఆన్ లైన్ గేమింగ్ ద్వారా ఓ పోలీసు అధికారి రూ. 1.5 కోట్లు గెలుచుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన సంతోషం వారం రోజుకు కూడా నిలువలేదు. ఆ ఇన్‌స్పెక్టర్  బెట్టింగ్ యాప్ ద్వారా కోటీశ్వరుడు కావడమే ఆయనకు పెద్ద సమస్యగా మారింది. అతడు బుధవారం నాడు దుష్ప్రవర్తన ఆరోపణలపై సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. 
 
వివరాల్లోకెళ్తే..  పుణే పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న పింప్రి-చించ్వాడ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండే డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో జెండే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే అతనిపై విచారణకు ఆదేశించారు.  ప్రభుత్వ అధికారి కావడంతో ఇలాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్‌లను అనుమతించి డబ్బులు గెలుచుకోవడం సరైనదేనా? అనే విషయమై ఇప్పుడు శాఖాపరమైన విచారణ మొదలైంది. ఈ ఇన్‌స్పెక్టర్ పూణేలోని పింప్రి-చించ్‌వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పోస్టింగ్‌లో ఉన్నారని చెబుతున్నారు. 

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వప్నా గోర్ దీనిపై విచారణ జరుపనున్నారు. చట్టపరమైన, పరిపాలనాపరమైన విషయాలను పరిశోధించిన తర్వాత.. పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండేపై చర్యలు తీసుకుంటామని పింప్రి-చించ్వాడ్ పోలీసులు తెలిపారు. 

Latest Videos

విచారణ ముగిశాక అతనిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సతీష్ మానె కూడా తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వప్నా గోర్ దీనిపై విచారణ జరుపనున్నారు. ప్రభుత్వ అధికారి అయినందున ఇలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుపుతారు.  .
 
హోంమంత్రికి ఫిర్యాదు 

ఇదిలా ఉండగా.. ఎస్‌ఐ సోమనాథ్ జెండేపై బిజెపి స్థానిక నాయకుడు అమోల్ థోరట్ నేరుగా హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యూటీ ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా యూనిఫాంలో డబ్బు సంపాదించి, అదే యూనిఫాంలో మీడియా ముందు కనిపించడం ద్వారా యువతను ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేలా ప్రోత్సహించాడని థోరట్ ఆరోపించారు.

click me!