దేశంలో పరుగులు పెట్టనున్న ఫస్ట్ ర్యాపిడ్ రైలు.. ఎప్పుడు ? ఎక్కడ నుంచి ?

By Rajesh Karampoori  |  First Published Oct 19, 2023, 12:22 AM IST

RAPIDX train project: ప్రధాని మోదీ దేశానికి మరో ఆధునిక రైలును అందించనున్నారు. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని అక్టోబర్ 20 న ప్రారంభించనున్నారు. ర్యాపిడ్ రైల్ ప్రారంభంతో ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.


RAPIDX train project: ప్రధాని మోదీ దేశానికి మరో ఆధునిక రైలును అందించనున్నారు. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని అక్టోబర్ 20 న ప్రారంభించనున్నారు. ర్యాపిడ్ రైల్ ప్రారంభంతో ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. వివరాల్లోకెళ్తే..  ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ (ఢిల్లీ మీరట్ RRTS) ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2019లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

82 కి.మీ పొడవున్న ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ 20 వ తేదీన  ప్రారంభించనున్నారు. మొదటి దశలో.. ప్రజలు ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ నుండి దుహై వరకు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. అదే రోజు ఘజియాబాద్‌లోని వసుంధరలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జిల్లా యంత్రాంగం, భాజపా బృందం అంతా ఇప్పటికే బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. వసుంధర సెక్టార్-8లోని పెద్ద మైదానంలో బహిరంగ సభ జరగనుంది. 50 వేల మందిని తరలిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Latest Videos

తొలి టికెట్‌ను కొనుగోలు చేయనున్న ప్రధాని మోదీ 

వాస్తవానికి, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ (RRTS)  కింద దీనిని ఢిల్లీ నుండి ఘజియాబాద్ మీదుగా మీరట్ వరకు నిర్మిస్తున్నారు. RRTS ఈ విభాగానికి రాపిడెక్స్ అని పేరు పెట్టారు. ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన బృందం ర్యాపిడ్ రైలు ఛార్జీలకు సంబంధించి సర్వే నిర్వహించింది. ఇప్పుడు దాని కనీస ధర రూ. 15 నుండి రూ. 20 వరకు ఉంచవచ్చని మరియు గరిష్ట ఛార్జీని రూ. 160 వరకు ఉంచవచ్చని భావిస్తున్నారు. ర్యాపిడెక్స్‌ను ప్రారంభించేందుకు ఘజియాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, ర్యాపిడ్ రైలు తొలి టికెట్‌ను కొనుగోలు చేయనున్నారు.

ఢిల్లీ-మీరట్ ప్రాజెక్టు పొడవు 82 కి.మీ

రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఢిల్లీ నుండి మీరట్ వరకు నిర్మించబడుతోంది. దీని మొత్తం పొడవు 82 కిలోమీటర్లు. మొదటి దశ ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ స్టేషన్ నుండి దుహై డిపో స్టేషన్ వరకు 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ దశ పూర్తిగా సిద్ధంగా ఉంది, దీనిని అక్టోబర్ 20 న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు, దీని కోసం సన్నాహాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత గురువారం ఘజియాబాద్‌కు వచ్చి దాని సన్నాహాలను పరీక్షించారు.

ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని 

ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ RRTS ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడే ప్రధానమంత్రి తన మొదటి ర్యాపిడ్ రైలు టిక్కెట్టును UPI నుండి కొనుగోలు చేస్తారు. ఆయన సాహిబాబాద్ నుంచి దుహై డిపో వరకు కూడా ప్రయాణించనున్నారు. ప్రధానమంత్రి ప్రయాణ సమయంలో మూడు రాపిడ్‌ఎక్స్ రైళ్లు ఆయనతో కలిసి నడుస్తాయి. మొదటి రైలు పైలట్ రైలు, రెండో రైలు ప్రయాణికుల కోసం, మూడో రైలులో ప్రధాని మోదీ, సీఎం యోగి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రయాణించనున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రైలులోని ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అత్యాధునిక సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. రాపిడెక్స్ నిర్వహణ బాధ్యత నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌పై ఉంటుంది.

60 నిమిషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ కు 

ఢిల్లీ నుండి మీరట్ చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుందని తెలుస్తోంది. ఢిల్లీ మరియు మీరట్ మధ్య మొత్తం మార్గం నిర్మాణం తర్వాత మొత్తం 30 ర్యాపిడ్ రైళ్లు నడపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఘజియాబాద్‌లోని దుహై యార్డ్‌లో ర్యాపిడ్ రైల్ కారిడార్ యొక్క ఆపరేషన్ , కమాండ్ కంట్రోల్ సెంటర్ సిద్ధం చేయబడింది. ఇలాంటి ఎనిమిది లైన్లను ప్రభుత్వం గుర్తించింది. వీటిని ఆర్‌ఆర్‌టిఎస్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తారు. ఎన్‌సీఆర్‌టీసీ మొదటి దశలో మూడు కారిడార్లను నిర్మిస్తున్నారు. అవి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్, ఢిల్లీ-గుర్గావ్-నిమ్రానా-అల్వార్, ఢిల్లీ-పానిపట్.
 

click me!