ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు గెహ్లాట్: అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్

By narsimha lodeFirst Published Jul 24, 2020, 3:21 PM IST
Highlights

: రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో శుక్రవారం నాడు మధ్యాహ్నం రాజ్‌భవన్ కు చేరుకొన్నారు.  గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు.
 

జైపూర్: రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో శుక్రవారం నాడు మధ్యాహ్నం రాజ్‌భవన్ కు చేరుకొన్నారు.  గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ జిందాబాద్ అంటూ రాజ్ భవన్ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.గవర్నర్ ను కలిసేందుకు వెళ్లే సమయంలో విక్టరీ సింబల్ చూపుతూ ఆశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ లోకి వెళ్లారు.

alo read:రాజస్థాన్ హైకోర్టులో సచిన్‌కు బిగ్ రిలీఫ్: అసమ్మతి ఎమ్మెల్యేలపై యధాతథస్థితి కొనసాగింపు

సోమవారం నాడు అసెంబ్లీని సమావేశపర్చాలని గెహ్లాట్ గవర్నర్ ను కోరారు. ఈ మేరకు గవర్నర్ కు సీఎం ఈ నెల 23వ తేదీన లేఖ రాశాడు. తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొంటామని గెహ్లాట్ ధీమాను వ్యక్తం చేశారు.సోమవారం నాడు అసెంబ్లీని సమావేశపర్చకపోతే ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. గవర్నర్ పై కేంద్రం ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు.

సచిన్ పైలెట్ సహా ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై యధాతథస్థితిని కొనసాగించాలని కోరుతూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటలకే రాజ్ భవన్ కు ఆశోక్ గెహ్లాట్ చేరుకొన్నారు. బలాన్ని నిరూపించుకొనేందుకు అసెంబ్లీని సమావేశపర్చాలని కోరారు. 

click me!