30 సెకండ్లలో కరోనా టెస్ట్, ఇజ్రాయెల్ తో చేయి కలిపిన భారత్

By Sreeharsha GopaganiFirst Published Jul 24, 2020, 1:00 PM IST
Highlights

కరోనా వైరస్ బారినపడ్డవారిని కేవలం 30 సెకండ్లలోనే గుర్తించే పరికరాన్ని రూపొందించేందుకు భారత్, ఇజ్రాయెల్ చేతులు కలుపుతున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యం, భారత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మేళవించి ఈ పరికరాన్ని రూపొందించనున్నట్టుగా తెలియవస్తుంది. 

కరోనా మహమ్మరి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ చిత్రపటంపై ఏ ఒక్క దేశాన్ని కూడా కరోనా వదిలేట్టుగా కనబడడం లేదు. అన్ని దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. మన దేశంలో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పుడు మనముందున్న ఏకైక మార్గం కరోనా బారినపడ్డవారిని ఐసొలేషన్ కి తరలించడం. సాధ్యమైనంత త్వరగా కరోనా బారినపడ్డవారిని గుర్తించి వారికి చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడడంతోపాటుగా, మిగిలిన ప్రజలు కూడా ఈ వైరస్ బారినపడకుండా కాపాడవచ్చు. 

కరోనా వైరస్ బారినపడ్డవారిని కేవలం 30 సెకండ్లలోనే గుర్తించే పరికరాన్ని రూపొందించేందుకు భారత్, ఇజ్రాయెల్ చేతులు కలుపుతున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యం, భారత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మేళవించి ఈ పరికరాన్ని రూపొందించనున్నట్టుగా తెలియవస్తుంది. 

ఇజ్రాయెల్‌ రక్షణ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ (డీడీఆర్‌డీ), భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లు సంయుక్తంగా భాగస్వామ్యంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేయబోతున్నట్టుగా ప్రకటించాయి. 

ఇకపోతే.... గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజే 49,310 కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు 740 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,945కి చేరుకొన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 30,601కి చేరుకొంది.

పంజాబ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 441 కొత్తకేసులు  నమోదయ్యాయి.రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,739కి చేరుకొంది. కరోనాతో 277 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3721కి చేరింది.

ఉత్తరాఖండ్ లో గత 24 గంటల్లో కరోనా కేసులు 145 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 5445కి చేరుకొన్నాయి. కరోనాతో 60 మంది మరణించారు. నిన్న ఒక్క రోజు కరోనాతో 3 చనిపోయారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 145 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5445కి చేరుకొన్నాయి. నిన్న ముగ్గురు మరణించారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 60కి చేరుకొంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1948కి చేరుకొన్నాయని కేంద్రం తెలిపింది.

సిక్కింలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య  460కి చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 338గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. 

click me!