నా భర్తను నేనే కాల్చి చంపేదానిని: వికాస్ దూబే భార్య రిచా

By narsimha lodeFirst Published Jul 24, 2020, 1:49 PM IST
Highlights

 ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన తన భర్తను తానే కాల్చి చంపే దానిని అని వికాస్ దూబే భార్య రిచా దూబే చెప్పారు.


లక్నో: ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన తన భర్తను తానే కాల్చి చంపే దానిని అని వికాస్ దూబే భార్య రిచా దూబే చెప్పారు.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత గురువారం నాడు తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడారు. అతడు చేసిన దారుణాలను ఎప్పటికీ క్షమించలేనని ఆయన స్పష్టం చేశారు.ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలను ఆయన నాశనం చేశాడు. దీంతో తమ ముఖాలను మేం బహిరంగంగా చూపించలేమన్నారు. 

జూలై 3వ తేదీన వికాస్ దూబే తనకు ఫోన్ చేశాడు. పోలీసులపై దాడి జరుగుతోంది. పిల్లలను తీసుకొని బిక్రూ గ్రామాన్ని వదిలి వెళ్లాలని సూచించినట్టుగా  ఆమె గుర్తు చేసుకొన్నారు. అయితే వీటన్నింటితో తాను విసిగిపోయాయని తాను అతనికి ఫోన్ లో చెప్పినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.

also read:రక్తస్రావం, షాక్‌తోనే దూబే మృతి: పోస్టుమార్టం నివేదిక

ఆ తర్వాత పిల్లలను తీసుకొని లక్నోకు చేరుకొన్నానని ఆమె తెలిపారు. అక్కడే ఓ పాడుబడిన భవనంలో వారం రోజుల పాటు గడిపినట్టుగా ఆమె చెప్పారు. అత్త, మామలతో పాటు తన కుటుంబం నుండి  ఎలాంటి  మద్దతు లభించదన్నారు.

వికాస్ గతంలో ఓ ప్రమాదానికి గురైనట్టుగా చెప్పారు.ఈ సమయంలో మెదడులో సమస్య ఏర్పడిందన్నారు. దీనికి చికిత్స కూడ తీసుకొన్నాడన్నారు. అయితే నాలుగు నెలలుగా చికిత్సను నిలిపివేశాడన్నారు. దీంతోనే ప్రతి దానికి కోపంతో ఊగిపోయేవాడని చెప్పారు.

ఈ నెల 10వ తేదీన కాన్పూరు శివారులో జరిగిన ఎన్ కౌంటర్ లో వికాస్ దూబే మరణించాడు. ఉజ్జయిని నుండి కాన్పూర్ కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.


 

click me!