
ఉక్రెయిన్‌లో (ukraine ) రష్యా బలగాల దాడిలో (russina army) భారత విద్యార్ధి మరణించడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ క్రమంలో విద్యార్ధి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి (karnataka cm) బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు నవీన్ కుటుంబం తనకు తెలుసునని.. వారితో చాలా సన్నిహిత సంబంధాలు వున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే నవీన్ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి.. ఓదార్చారని బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర విదేశాంగ శాఖలతో మాట్లాడానని బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.
మృతుడిని కర్ణాటకకు (karnataka) చెందిన నవీన్‌గా (naveen) గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (ministry of external affairs) అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి .. తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఇతను ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది.
అయితే నవీన్‌ను అసలు రష్యా సేనలు ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందినే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే.. మృతుడి సమీప బంధువుకు విదేశాంగశాఖ అధికారులు చెప్పిన దానిని బట్టి.. బంకర్‌లో వుంటున్న నవీన్ మంగళవారం ఉదయం సరుకులు తెచ్చుకోవడానికి దగ్గరలోని స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. అప్పటికే రష్యా సేనలు నగరంలోకి చొచ్చుకురావడం, ఉక్రెయిన్ సేనలు వారిని ప్రతిఘటిస్తుండటం జరుగుతోంది.
ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న వార్ జోన్‌లోకి నవీన్ ప్రవేశిం అతనిపై కాల్పులు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గాయాలతో ఆసుపత్రిలో వున్నాడు.. లేక చనిపోయాడా అని నవీన్ బంధువు ప్రశ్నించగా.. అతను చనిపోయినట్లు 100 శాతం ధ్రువీకరణ అయ్యిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే విషయమై అడగ్గా.. ప్రస్తుతం ఆ ప్రాంతం వార్ జోన్‌లో వుందని, భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచామని.. పరిస్ధితులు చక్కబడిన తర్వాత స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.