సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..

Published : May 17, 2023, 08:18 AM ISTUpdated : May 17, 2023, 08:33 AM IST
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..

సారాంశం

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మరణించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఎలాంటి రక్షణా పరికరాలు లేకుండా ఆ కార్మికులు ట్యాంక్ లోకి దిగి పని  చేస్తున్నారు. అయితే ఒక్క సారిగా విష వాయువులు వెలువడటంతో ఈ ప్రమాదం జరిగింది. 

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా వెలువడిన విషవాయువులు పీల్చి ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో చోటు చేసుకుంది. ఇలాంటి పనికి మనుషులను ఉపయోగించకూడదని అక్కడి నిబంధనలు చెబుతున్నా.. ఓ ఇంటి ఓనర్ వారితో పని చేయించారు. దీంతో యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. 5 గురు మృతి..

వివరాలు ఇలా ఉన్నాయి. పుళల్ సమీపంలోని గురుశాంతి నగర్ కు చెందిన నిర్మల వద్ద కవంగరైలోని కొండియమ్మన్ నగర్ కు చెందిన భాస్కరన్ (52), ఇస్మాయిల్ (36) అనే భార్య భర్తలు పని చేస్తున్నారు. వీరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కార్మికుడు గణేశన్ కూడా ఆమె వద్ద పని చేస్తున్నారు. అయితే యజమాని ఆదేశాలతో ఆ ముగ్గురు సెప్టింగ్ ట్యాంక్ క్లీన్ చేసే పనిని మొదలు పెట్టారు. ఆ మహిళ బయటే ఉండగా.. భాస్కరన్, గణేశన్ సెప్టిక్ ట్యాంక్ లోకి దిగారు.

అయితే వారు ఆ సమయంలో ఎలాంటి భద్రతా పరికరాలు ధరించలేదు. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విష వాయువులు వెలువడ్డాయి. దీంతో ఆ కార్మికులకు ఊపిరి ఆడకపోవడంతో వారు మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 

కరీంనగర్ లో విషాదం.. నెలల క్రితం కోడలు, మూడు రోజుల కిందట కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి మృతి..

కాగా.. తమిళనాడు ప్రభుత్వం  2022లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. మాన్యువల్ స్కావెంజర్స్ గా పనిచేయడాన్ని నిషేధించింది. మాన్యువల్ స్కావెంజింగ్ కోసం ఏ వ్యక్తినైనా నియమించడం ఈ చట్టం ప్రకారం శిక్షార్హం. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రక్షణ పరికరాలు, పరికరాలు, పటిష్టమైన భద్రతా జాగ్రత్తలతో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను మాన్యువల్ గా శుభ్రపర్చవచ్చు. 

మురుగునీటి లేదా సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసే వారందరికీ ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ లైన్ బ్రీతింగ్ ఎక్విప్ మెంట్, మాన్యువల్ గా ఆపరేట్ చేసే ఎయిర్ బ్లోయర్ తో కూడిన ఎయిర్ లైన్ రెస్పిరేటర్, బ్రీత్ మాస్క్, బ్రీతింగ్ ఎక్విప్ మెంట్, క్లోరిన్ మాస్క్, ఫుల్ బాడీ వేడర్ సూట్, సెర్చ్ లైట్ తో సహా 44 భద్రతా పరికరాలను అందించాల్సి ఉంటుంది. అన్ని ప్రొటెక్టివ్ గేర్, సేఫ్టీ డివైజ్ లను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయాలి. అవసరమైన రిపేర్లు లేదా రీప్లేస్ మెంట్ లను యజమాని చేయించాలి. ఇలాంటి పని చేయడానికి కనీసం ముగ్గురు ఉండాలని, అందులో ఒకరు సూపర్ వైజర్ అయి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. 

Karnataka CM: "కర్నాటకం".. సీఎం రేసులో మరో పేరు తెరపైకి..!

మురుగునీటి లేదా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరిచే పని పగటిపూట మాత్రమే చేయాలి. వరుసగా 90 నిమిషాలకు మించకుండా ట్యాంకులో ఉండకూడదు. రెండు స్ట్రెచ్ ల మధ్య తప్పనిసరిగా 30 నిమిషాల విరామం ఇవ్వాలి. ఆపరేషన్, రెస్క్యూ ప్రక్రియలను ఎంట్రీ సైట్ వద్ద డిస్ ప్లే చేయాలి. 

PREV
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!