పదో తరగతి జనరల్ సైన్స్ ప్రశ్నాపత్రం లీక్.. పరీక్షను రద్దు చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

Published : Mar 13, 2023, 04:20 PM ISTUpdated : Mar 13, 2023, 04:22 PM IST
పదో తరగతి జనరల్ సైన్స్ ప్రశ్నాపత్రం లీక్.. పరీక్షను రద్దు చేసిన బోర్డ్  ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

సారాంశం

అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరగాల్సిన పదో తరగతి జనరల్ సైన్స్ పేపర్ ను ఆ రాష్ట్ర సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని పేర్కొంటూ దీనిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. త్వరలోనే పరీక్ష తేదీని వెల్లడిస్తామని తెలిపింది. 

ఇటీవల పేపర్ లీకులు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణలో టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్న టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్  పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. ఇది మరవక ముందే అస్సాంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష జనరల్ సైన్స్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర సెంకడరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షను రద్దు చేసింది. 

హైకోర్టు కాంప్లెక్స్ నుంచి మసీదు తొలగించండి.. మూడు నెలల సమయం ఇస్తున్నాం: సుప్రీంకోర్టు ఆదేశం

అస్సాం రాష్ట్రంలో  బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.  అందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు జనరల్ సైన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో బోర్డు ఆదివారం అర్ధరాత్రి పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఈ విషయం చాలా మంది విద్యార్థులకు తెలియలేదు. ఎప్పటిలాగే రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీపై ఆధారాలు లభించడంతో ఆదివారం అర్ధరాత్రి సెబా పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు మీడియాకు తెలిపారు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని, సోమవారం ఉదయం వాటిని పరీక్షా కేంద్రాలకు పంపించాల్సి ఉందన్నారు. కానీ లీకేజీ వల్ల పరీక్షను రద్దు చేశామని తెలిపారు. ఈ విషయంలో ఎస్ఈబీఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత డీజీపీ సింగ్ తో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. సరైన విచారణ అనంతరం దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. జనరల్ సైన్స్ పరీక్ష ను ఎప్పుడు నిర్వహిస్తారన్నది సెకండరీ బోర్డు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. 

హోలీ రోజున జొమాటో డెలివరీ బాయ్ పై దాడి.. వీడియో వైర‌ల్, నలుగురిపై కేసు నమోదు

కాగా.. ఈ పరీక్ష రద్దుపై ఎస్ఈబీఏ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ‘‘మార్చి 13, 2023 (సోమవారం) జరగాల్సిన జనరల్ సైన్స్ (సీ 3) సబ్జెక్టుకు చెందిన హెచ్ఎస్ఎల్సీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం చేతిలో రాసి ఉన్న పేపర్ కొంత మంది చేతిలో ఉంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. కాబట్టి ఇలాంటి వార్తలు అభ్యర్థుల మదిలో గందరగోళం సృష్టిస్తాయనే నమ్మకం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జనరల్ సైన్స్ (సీ3) సబ్జెక్టు పరీక్షను రద్దు చేస్తున్నాం’’ అని పేర్కొంది. దీనిపై ఎస్ఈబీఏ విచారణ ప్రారంభించిందని, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2006లో హెచ్ఎస్ఎల్సీ పరీక్ష పేపర్ లీక్ అయింది.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu