
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టులోని మసీదును తొలగించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ మసీదు కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ నిర్మాణం ప్రాపర్టీ లీజు రద్దైన ప్రాంతంలో ఉన్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి, దీన్ని అలాగే కొనసాగించాలని కోరడం సరికాదని వివరించింది. వక్ఫ్ మసీదు హైకోర్టు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం తోసిపుచ్చింది.
అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఉన్న మసీదును మరో చోటుకి తరలించాలని అలహాబాద్ 2017 నవంబర్‌లోనే ఓ తీర్పు ఇచ్చింది. అందుకు మూడు నెలల గడువు ఇచ్చింది.
న్యాయమూర్తులు ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌ల ధర్మాసనం తాజాగా విచారించింది. అయితే, మసీదును మరో ప్రాంతానికి తరలించడానికి కావాల్సిన భూమిని అడగడానికి యూపీ ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం ఇచ్చింది.
Also Read: అల్లాకు చెవుడా? అజాన్ ప్రార్థన కోసం లౌడ్ స్పీకర్లు ఎందుకు?: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పదం
‘ఈ నిర్మాణాన్ని కూల్చివేయడానికి మూడు నెలల సమయాన్ని మంజూరు చేస్తున్నాం. ఈ రోజు నుంచి మూడు నెలల్లో మసీదును మరో చోటుకి తరలించి అక్కడ నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. దాన్ని తొలగించడమైనా, కూల్చివేయడానికైనా హైకోర్టు అధికారులకు అవకాశం ఇస్తున్నాం’ అని ధర్మాసనం తాజాగా తెలిపింది.