ఎన్టీఆర్ స్మారక నాణెం ధర ఎంతో తెలుసా?

Published : Aug 29, 2023, 12:51 PM IST
ఎన్టీఆర్ స్మారక నాణెం ధర ఎంతో తెలుసా?

సారాంశం

ఈ నాణెన్ని మార్కెట్లోకి కూడా విడుదల చేస్తున్నారు. కావాలి అనుకునేవారు ఈ నాణేన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, దీనిని ఎలా కొనుగోలు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

దివంగత ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 స్మారక నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న నాణెం విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నాణెం ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 

అయితే, ఈ నాణెన్ని మార్కెట్లోకి కూడా విడుదల చేస్తున్నారు. కావాలి అనుకునేవారు ఈ నాణేన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, దీనిని ఎలా కొనుగోలు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ శత జయంతి రూ.100 నాణెం ధరను రూ.4,850( చెక్క డబ్బా) తో, రూ.4,380 ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్, రూ.4,050 యూఎన్సీ ఫోల్డర్ ప్యాక్ గా నిర్ణయించారు. 50 శాతం  వెండి, 4 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్ మిశ్రమంతో తయారు చేశారు. ఈ మెటల్స్ కాంబినేషన్ లో చేయడం వల్ల ఈ నాణెం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది.

ప్రభుత్వ వెబ్ సైట్ https://www.indiagovtmint.in/en/commemorative-coins లో  ఈ నాణేన్ని కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ విక్రయ కేంద్రాల్లోని విక్రయ కేంద్రాల్లో నేరుగా కొనుక్కోవచ్చు. 
 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood