హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: లులూ గ్రూప్ చైర్మెన్ సురక్షితం

Published : Apr 11, 2021, 12:18 PM IST
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: లులూ గ్రూప్ చైర్మెన్ సురక్షితం

సారాంశం

లులూ గ్రూప్ చైర్మెన్ ఎంఏ యూసుఫ్ అలీ, అతని భార్యతో పాటు ఐదుగురు ప్రయాణీస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా కేరళ రాష్ట్రంలోని కోచిలో ఆదివారంనాడు అత్యవసరంగా ల్యాండైంది.


తిరువనంతపురం: లులూ గ్రూప్ చైర్మెన్ ఎంఏ యూసుఫ్ అలీ, అతని భార్యతో పాటు ఐదుగురు ప్రయాణీస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా కేరళ రాష్ట్రంలోని కోచిలో ఆదివారంనాడు అత్యవసరంగా ల్యాండైంది.కొచ్చి శివార్లలోని జాతీయ రహదారి 66 పక్కనే అత్యవసరంగా ల్యాండైంది. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో చాపర్ లో ఉన్న ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.

వారంతా సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. ఐదుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.లులూ గ్రూప్ కి చెందిన హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కొచ్చి సమీపంలో అత్యవసరంగా ల్యాండైంది.

కొచ్చికి సమీపంలోని పానన్‌గడ్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన  చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.హెలికాప్టర్  ప్రయాణిస్తున్న సమయలో వాతావరణ సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో వర్షం, ఈదురు గాలులు వీస్తున్నాయని స్థానికులు తెలిపారు.ఈ చాపర్ లో ప్రయాణీకిస్తున్నవారంతా సురక్షితంగా బయటపడడంతో  అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని ప్రజలు మాత్రం నమ్మారు
Kerala Results 2026 : కేరళలో బిజెపి ఖాతా తెరవడం ఖాయం.. గెలిచే నాలుగు సీట్లు ఇవే..!