
చైనా తన వైఖరిని సూక్ష్మంగా ముందుకు తీసుకెళ్లడానికి, తమపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఎలా ఉపయోగిస్తుందనే విషయాలను ది న్యూయార్క్ టైమ్స్ వివరణాత్మక పరిశోధన ద్వారా బహిర్గతమైనన సంగతి తెలిసిందే. న్యూ యార్క్ టైమ్స్ ఇప్పుడు వెల్లడించినది మొదటిసారిగా జరిగినది కాదని.. అయితే ఇది భారతదేశ ఎదుగుదలను వ్యతిరేకిస్తున్న దేశానికి వెలుపల ఉన్న స్వార్థ ప్రయోజనాల ద్వారా నిధులు సమకూర్చి, ప్రోత్సహించబడుతున్న ఆపరేటర్ల నెట్‌వర్క్‌చే సంక్లిష్టమైన కుట్రలో భాగమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
న్యూస్‌క్లిక్ అనే వెబ్ పోర్టల్ గురించి న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన విషయాలు, చైనా ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 38 కోట్ల నిధులు అందుకుందనే అంశాలకు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక సమూహం వ్యక్తులు,స్వార్థ ప్రయోజనాలు కలిసి.. ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడి పెట్టినప్పుడు, గొప్ప సమన్వయంతో పనిచేసినప్పుడు, క్రాస్-పోస్ట్ , ఒకరికొకరు కంటెంట్‌ను పంచుకున్నప్పుడు, వారు గొప్ప ఉమ్మడి స్థిరమైన లక్ష్యాన్ని పంచుకుంటారు. అది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి, ప్రభుత్వం గురించి అసత్యాలు,ద్వేషం, అసమ్మతిని పెంచడం. ఇటీవల మణిపూర్‌లో మనం దీనిని చూశాము . వ్యూహం, స్థిరమైన కథనానికి విశేషమైన కలయిక ఉంది. హాస్యాస్పదంగా ఈ కథనానికి అనుగుణంగా ఉండే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు’’ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
‘‘న్యూస్‌క్లిక్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లు బయటపెట్టిన ఈ కథనాలను ఈ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ దాదాపు గుడ్డిగా ప్రతిధ్వనించారు. విదేశాలకు వెళ్లి సరిగ్గా అదే మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, న్యాయవ్యవస్థ రాజీ పడింది, ఈవీఎంలు రాజీ పడ్డాయి అని చెప్పుకొచ్చారు. ఇవి ఖచ్చితంగా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన కథనాలు’’ అని అన్నారు.
‘‘ఇది సాధారణమైనది కాదు. అమాయక చర్య కాదు. ఇది సంక్లిష్టమైన కుట్ర. ఇది భారతదేశ ఎదుగుదలను, ప్రపంచ దేశాల సమాజంపై దాని విశ్వాసాన్ని, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను, గ్లోబల్ వాల్యూ చైన్‌లలో ఉనికిని వ్యతిరేకించే దేశం వెలుపల ఉన్న స్వార్థ ప్రయోజనాల ద్వారా నిధులు సమకూర్చబడుతున్న ఆపరేటర్ల నెట్‌వర్క్’’ అని చెప్పారు.
తప్పుడు సమాచారం దేశ ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రమాదం అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘‘తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ.. ఈ ప్లాట్‌ఫారమ్‌లు తమ స్నేహితులతో కలిసి దూకుతాయి. వాక్ స్వేచ్ఛ అంటూ ర్యాలీ చేస్తాయి. రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన వాక్ స్వాతంత్య్ర హక్కు.. దేశం యొక్క ఎదుగుదలను అరికట్టడానికి ఉద్దేశించిన తప్పుడు సమాచారానికి కవర్ కాదు. మన దేశం, ప్రభుత్వం, విశ్వాసం, సమాజంపై దుష్ప్రచారం చేసే ప్లాట్‌ఫారమ్‌లకు ఒక విదేశీ దేశం చురుకుగా నిధులు సమకూరుస్తోందన్న సమాచారం ద్వారా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.