
న్యూఢిల్లీ: రాజ్యసభలో బిల్లును నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ( సవరణ )2023 బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారంనాడు ప్రవేశ పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభలో నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ( సవరణ) 2023 బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఆర్డినెన్స్ స్థానంలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన విపక్ష పార్టీలు ఈ బిల్లును నిరసిస్తూ లోక్ సభ నుండి వాకౌట్ చేశాయి. అధికార పార్టీకి మెజారిటీ ఉండడంతో ఈ బిల్లుకు లోక్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు.
ఈ నెల 1వ తేదీన లోక్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. రెండు రోజుల తర్వాత లోక్ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును రాజ్యసభలో ఇవాళ ప్రవేశ పెట్టింది కేంద్రం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా ఈ బిల్లు ఉందని లోక్ సభలో విపక్షాలు కేంద్రంపై విమర్శలు చేశాయి.ఈ బిల్లును ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లును వ్యతిరేకించాలని దేశంలోని ఇతర పార్టీల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడగట్టారు.
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. ప్రసుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుత స్థానాల సంఖ్య 237. రాజ్యసభలో 119 ఓట్లు పొందితే ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీల ఎంపీల సంఖ్య రాజ్యసభలో 105 మంది ఉన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు కొన్ని బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉంది. ఈ పార్టీల మద్దతుతో బీజేపీ ఈ బిల్లును రాజ్యసభలో కూడ ఆమోదింపజేసుకొనే అవకాశం ఉంది.
also read:లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు: విపక్షాల ఆందోళన
కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి చర్చను ప్రారంభించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా బిల్లు ఉందని ఆయన విమర్శలు చేశారు