ఎట్టకేలకు ఢిల్లీలో ల్యాండైన చైనా విదేశాంగ శాఖ మంత్రి... ఆద్యంతం సస్పెన్స్

Siva Kodati |  
Published : Mar 24, 2022, 09:57 PM IST
ఎట్టకేలకు ఢిల్లీలో ల్యాండైన చైనా విదేశాంగ శాఖ మంత్రి... ఆద్యంతం సస్పెన్స్

సారాంశం

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి.. భార‌త ప‌ర్యట‌న‌పై చివ‌రి దాకా స‌స్పెన్స్ నెల‌కొంది. ఆయన ఢిల్లీలో విమానం దిగేదాకా కూడా వాంగ్ ప‌ర్య‌ట‌నపై స‌స్పెన్స్ నెల‌కొంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఓ చైనా మంత్రి భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 

భారత్- చైనా సరిహద్దుల్లో (indo china border) లడఖ్ (border) వద్ద ప్రతిష్టంభన మొదలైన రెండేళ్ల తర్వాత చైనా విదేశాంగ మంత్రి (China's foreign minister ) వాంగ్ యి (Wang Yi ) భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వాంగ్ యి రేపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (s jai shankar) , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో (Ajit Doval) భేటీకానున్నారు. వాంగ్ యి పర్యటన ఉద్దేశం.. ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం. 

అలాగే ఈ ఏడాది చివరిలో బీజింగ్‌లో నిర్వహించనున్న బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి (BRICS meeting) ప్రధాని నరేంద్ర మోడీని (narendra modi) ఆహ్వానించడమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాంగ్ పర్యటనపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. చైనా విదేశాంగ మంత్రి ఢిల్లీలో దిగే వరకు అది ధ్రువీకరణ కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరిన ఆయన విమానం ఫ్లైట్ పాత్‌ను ట్రాక్ చేయడం ద్వారా చివరికి ల్యాండింగ్‌ను నిర్ధారించారు. 

లడఖ్‌లో చైనా చొరబాట్లు తరచుగా జరగడం, గాల్వాన్ వ్యాలీలో 20 మంది భారతీయ సైనికులు సహా భారీగా చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ కారణంగా భారత్- చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. పలుమార్లు అత్యున్నత స్థాయి సైనిక చర్చల తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. పెండింగ్‌లో వున్న సమస్యలను పరిష్కరించడానికి మార్చి 11న, భారత్- చైనా మధ్య 15వ విడత సైనిక చర్చలు జరిగాయి. అదే సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గాను జైశంకర్ .. మాస్కో, దుషాన్ బేలలో వాంగ్ యితో పలుమార్లు చర్చలు జరిపారు. 

సెప్టెంబర్ 2020లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కాన్‌క్లేవ్ (ఎస్‌సీవో) (Shanghai Cooperation Organisation ) సందర్భంగా వీరిద్దరూ మాస్కోలో విస్తృత చర్చలు జరిపారు. ఈ సమయంలో వారు తూర్పు లడఖ్‌లో సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఫైవ్ పాయింట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంతకుముందు అదే ఏడాది జూలైలో తజకిస్తాన్ రాజధాని దుషాన్ బేలో జరిగిన మరో ఎస్‌సీవో సమావేశం సందర్బంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తర్వాత సెప్టెంబర్‌కే మళ్లీ దుషాన్ బేలోనే మరో సమావేశం జరిగింది. 

కాగా.. పాకిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాశ్మీర్‌పై ఆయన చేసిన ప్రకటన వివాదం రేపింది. న్యూఢిల్లీ ఈ వ్యాఖ్యలపై మండిపడింది. జమ్మూకాశ్మీర్ భారత అంతర్గత విషయమని.. దీని గురించి పాక్, చైనా రెండింటికీ తెలుసునని పునరుద్ఘాటించింది. గతంలో దౌత్య వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లో ఇస్లామిక్ దేశాల సమావేశం ముగిసిన తరువాత చైనా విదేశాంగ మంత్రి నేరుగా భారతదేశానికి రావాల్సి ఉంది. 

రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించి దైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. అనంతరం ఈనెల 25 నుంచి 27 వరకు ఖాట్మండులో వాంగ్ యి పర్యటన ఉంటుందని నేపాల్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అర్థంతరంగా ఆయన భారత్ పర్యటనను వాయిదా వేసుకుని నేరుగా నేపాల్ చేరుకున్నారు. మొత్తంగా చైనాలో బ‌య‌లుదేరి.. ఆఫ్ఘ‌నిస్థాన్ మీదుగా వ‌చ్చిన వ్యాంగ్ ఢిల్లీలో ల్యాండ‌య్యే దాకా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై సాంతం స‌స్పెన్స్ న‌డిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?