గాల్వాన్‌ ఘర్షణ: చైనా చేతికి చిక్కిన 10 మంది భారత జవాన్లు విడుదల

Siva Kodati |  
Published : Jun 19, 2020, 02:37 PM ISTUpdated : Jun 19, 2020, 02:39 PM IST
గాల్వాన్‌ ఘర్షణ: చైనా చేతికి చిక్కిన 10 మంది భారత జవాన్లు విడుదల

సారాంశం

గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చైనా- భారత సైన్యాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి డ్రాగన్ కంట్రీ ఆధీనంలో ఉన్న 10 మంది మనదేశ జవాన్లు విడుదలయ్యారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చైనా- భారత సైన్యాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి డ్రాగన్ కంట్రీ ఆధీనంలో ఉన్న 10 మంది మనదేశ జవాన్లు విడుదలయ్యారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది గురువారం భారత్‌కు చేరినట్లు పేర్కొంది. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:చైనాతో ఘర్షణ: గాయపడ్డ సైనికుల వివరాలు వెల్లడించిన ఆర్మీ

కాగా జవాన్ల విడుదలకు సంబంధించి మంగళవారం నుంచి గురువారం వరకు గాల్వాన్ లోయలోని 14వ నెంబర్ పెట్రోల్ పాయింట్ వద్ద ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు మూడు సార్లు భేటీ అయ్యారు.

తాజాగా గురువారం మేజర్ జనరల్ అభిజిత్ బాపట్ అదే స్ధాయిలో చైనా సైన్యాధికారితో చర్చలు జరిపారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణతో ఇరు దేశాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో చర్చల విషయాన్ని ఆర్మీ గోప్యంగా ఉంచుతోంది.

Also Read:ఆకస్మాత్తు దాడి కాదు.. పక్కా స్కెచ్: ఈ ఇనుప చువ్వలతోనే భారత జవాన్లపై దాడి..?

కాగా జూన్ 15న గాల్వాన్ లోయ వద్ద భారత్ - చైనా దళాలు బాహాబాహీకి దిగడంతో ఇప్పటి వరకు 20 మంది భారత సైనికులు మరణించగా, 76 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌