కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. 24గంటల్లో 8మంది ఉగ్రవాదులు హతం

By telugu news teamFirst Published Jun 19, 2020, 1:00 PM IST
Highlights

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచరం అందుకున్న భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి షోపియాన్‌, షాంపూర్‌ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టాయి.

జమ్మూ కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. గత 24గంటల్లో రెండు వేర్వేరు చోట్ల ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. 

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచరం అందుకున్న భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి షోపియాన్‌, షాంపూర్‌ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపగా.. పాంపోర్‌‌ ప్రాంతంలో ముగ్గురు, షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు డీజీపీ దిల్బార్‌సింగ్‌ వెల్లడించారు. కాగా.. మీజ్‌ పాంపోర్‌‌‌ వద్ద ఆపరేషన్‌ నిర్వహిస్తున్నప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మసీదులోకి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పకడ్బందీ వ్యూహంతో శుక్రవారం ఉదయం వారిని మట్టుబెట్టాయి.

click me!