
బీజింగ్: రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, సమాచార మార్పిడి సాగుతున్న తరుణంలో ఈ సమయంలో ఎవరూ కూడ ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించడం సరైంది కాదని చైనా అభిప్రాయపడింది.
also read:చేతులు కట్టుకుని కూర్చోం: లడఖ్ వేదికగా చైనాకు ప్రధాని మోడీ హెచ్చరిక
శుక్రవారం నాడు ఉదయం చైనా ఇండియా సరిహద్దుల్లోని లడ్దాఖ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.చైనా ఆర్మీ దాడిలో గాయపడిన సైనికులను ఆయన పరామర్శించారు. సైనికులతో ఆయన గడిపారు. సైనికులను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు.
లడక్ లో మోడీ పర్యటనపై చైనా విదేశాంగశాఖ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన అధికార ప్రతినిధి శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు.తూర్పు లడక్ లో చైనా, ఇండియాకు చెందిన ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకొన్న తర్వాత రెండు దేశాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు దఫాలు చర్చలు జరిగాయి.
చైనా, ఇండియా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 21 మంది సైనికులు మరణించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ కుమార్ మరణించాడు. లడక్ ఘటనను ఇండియా సీరియస్ గా తీసుకొంది.