కరోనా వైరస్‌కు వ్యాక్సిన్:క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి పొందిన ఇండియన్ కంపెనీ

By narsimha lode  |  First Published Jul 3, 2020, 1:51 PM IST

కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో భారత్ కు చెందిన ఫార్మా కంపెనీ ముందడుగు వేసింది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు జైడస్ కాడిలా అనే సంస్థకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
 



న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో భారత్ కు చెందిన ఫార్మా కంపెనీ ముందడుగు వేసింది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు జైడస్ కాడిలా అనే సంస్థకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

హైద్రాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ  'కొవాగ్జిన్' అనే పేరుతో టీకాను డెవలప్ చేస్తోంది. ఈ టీకాను మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Latest Videos

also read:రెమిడెసివిర్ డ్రగ్: ఇండియాలో తయారీకి మైలాన్ ల్యాబ్ కు అనుమతి

తాజాగా ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన జైడస్ కాడిలా హెల్త్ కేర్ రూపొందించిన వ్యాక్సిన్ కూడ డీసీజీఐ అనుమతిని పొందింది. దేశంలో డీసీజీఐ అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్ ఇది. జైడస్ కాడిలా మొదటి, రెండు దశల్లో ఈ వ్యాక్సిన్  మానవులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుంది.

కరోనా నివారణకు గాను ప్రపంచంలోని పలు ఫార్మాసంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ సంస్థల పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి.అస్ట్రాజెనికా, మోడెర్నా కంపెనీలు వ్యాక్సిన్ రూపొందించడంలో అగ్రభాగాన నిలిచినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించిన వ్యాక్సిన్  చింపాంజీలపై ప్రయోగం సక్సెస్ అయింది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను  ప్రారంభించింది.

click me!