వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా సైన్యం మోహరింపు పెరిగిందని, భారత సైనికులు అప్రమత్తంగా ఉండి, కాపలాగా ఉన్నారని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను నిరంతరం గమనిస్తునామని తెలిపారు.
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు సెక్టార్‌లో చైనా వైపు సైనికుల సంఖ్య పెరిగిందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం తెలిపారు. ఎల్ఏసీ వైపు మౌలిక సదుపాయాలను నిర్మించామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు. వార్షిక ఆర్మీ డే ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి జనరల్ పాండే మాట్లాడారు. “తూర్పు సెక్టార్‌లో ప్రత్యర్థి వైపు సైనికుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అక్కడ జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ’’ అని అన్నారు.
ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఇది భద్రతా వైఫల్యం కాదు..
“పరిస్థితి స్థిరంగా ఉంది. నియంత్రణలో ఉంది. అయినప్పటికీ అనూహ్యమైనది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల గురించి మీకు తెలుసు. ఏడు సమస్యలలో ఐదింటిని పరిష్కరించుకోగలిగాము. మేము దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు కొనసాగిస్తున్నాము’’ అని ఆయన అన్నారు. ఉత్తరాదితో సహా అన్ని ఇతర సరిహద్దుల్లో గత ఐదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి మెరుగుపబడిందని అన్నారు. 2,100 కి.మీ రోడ్లు నిర్మించామని, కనెక్టివిటీ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఉత్తర సరిహద్దులను కలుపుతూ ఆల్-వెదర్ రోడ్లు కూడా నిర్మాణమయ్యాయని తెలిపారు.
నగ్న వీడియోకాల్ తో బ్లాక్ మెయిల్.. వ్యాపారికి రూ.2.69 కోట్లు టోకరా..
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి సరిహద్దు ఆవల నుండి మద్దతు లభిస్తోందని, అయితే కాల్పుల విరమణ బాగానే ఉందని మనోజ్ పాండే అన్నారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి విషయానికొస్తే ఫిబ్రవరి 2021 నాటి కాల్పుల విరమణ అవగాహన బాగానే ఉంది, అయితే ఉగ్రవాదం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు ఇప్పటికీ సరిహద్దు మద్దతు లభిస్తోంది’’ అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు.
మమత బెనర్జీకి ఉపశమనం.. ఆ కేసులో సమన్లు కొట్టివేయిన ముంబై సెషన్స్ కోర్టు ..
మే 2020లో చైనా వైపు సైన్యం చేరికను కొనసాగిస్తూ ముప్పు అంచనా ప్రకారం భారత సైన్యం తన బలగాలను తిరిగి మార్చడం ప్రారంభించిందని తెలిపారు. కొంతకాలం క్రితం చేపట్టిన దళాల వ్యూహాత్మక రీబ్యాలెన్సింగ్ పూర్తయిందని ఆర్మీ చీఫ్ చెప్పారు. ‘‘ మేము చాలా దృఢమైన రక్షణాత్మక భంగిమను కొనసాగించగలిగాం. మా ప్రత్యర్థి నుండి యథాతథ స్థితిని ఏకపక్షంగా దృఢంగా మమార్చడానికి చేసిన ప్రయత్నాలను నిరోధించగలిగాం’’ అని అన్నారు.
ఈ కేటుగాళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్‌టవర్‌నే మయం చేశారు.
2020 మేలో చైనా దళాలు స్టాండ్ ఆఫ్ మోడ్‌లో కదిలాయి. ఇది భారత సైన్యం మోహరింపునకు దారి తీసింది. ఏడు ప్రతిష్టంభన పాయింట్లలో ఐదింటిలో ఉపసంహరణలు ఉన్నప్పటికీ డిసెంబర్‌లో చైనా దళాలు భారత ఆర్మీ సైనికులతో ఘర్షణ పడడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. కాగా.. గత నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. జూన్ 2020లో గాల్వన్ ఘర్షణ తర్వాత రెండు సైన్యాల మధ్య జరిగిన మొదటి పరిణామం ఇదే.