Asianet News TeluguAsianet News Telugu

నగ్న వీడియోకాల్ తో బ్లాక్ మెయిల్.. వ్యాపారికి రూ.2.69 కోట్లు టోకరా..

నగ్న వీడియో కాల్ పేరుతో వలవేసి ఓ వ్యాపారి నుంచి రూ.2.69 కోట్లు వసూలు చేశారు ఓ ముఠా. నాలుగు నెలల్లో అతని నుంచి దాదాపు మూడు కోట్ల వరకు కాజేశారు. 

Businessman Loses Rs 2.69 Crore In Sextortion, Gujarat
Author
First Published Jan 13, 2023, 7:00 AM IST

గుజరాత్ : మనుషుల వీక్నెస్ తో ఆడుకుని..  బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకునే ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. న్యూడ్ కాల్స్ పేరుతో ముగ్గులోకి దింపి.. వాటిని రికార్డు చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ వ్యాపారిని ఏకంగా రూ.2.69 కోట్లకు  ముంచేశారు ఓ ముఠా. మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడమే ఆ వ్యాపారి చేసిన  తప్పు. దీంతో దీనికి సంబంధించిన వీడియోను బయటపెడతామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు 11మంది ఆ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేశారు.  అలా అతని దగ్గర దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు కాజేశారు.  

ఈ ఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో వెలుగు చూసింది.  నిరుడు ఆగస్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు…నిరుడు ఆగస్టు 8న గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారికి మోర్బికి చెందిన ఓ మహిళ కాల్ చేసింది. తన పేరు రియా శర్మ అని చెప్పింది. అతనితో న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో ఆ వ్యాపారి నగ్న దృశ్యాలను రికార్డు చేసింది. ఆ తర్వాత వీడియో తన దగ్గర ఉందని.. బయట పెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించింది. దీంతో షాక్ అయిన బాధిత  వ్యాపారి.. ఏం చేయాలో తోచక ఆమె అడిగిన రూ. 50,000 పంపించాడు. అయితే అంతటితో ఆ కథ ఆగిపోలేదు. 

ఈ కేటుగాళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్‌టవర్‌నే మయం చేశారు.

కొన్ని రోజుల తర్వాత  మరో వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు శర్మ అని.. తాను ఢిల్లీ ఇన్స్పెక్టర్ అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యాపారికి చెందిన నగ్న వీడియో క్లిప్ తన వద్ద ఉందని చెప్పాడు. రూ. దానిమీద కేసు పెట్టకుండా, వైరల్ అవ్వకుండా ఉండాలంటే రూ. మూడు లక్షలు ఇవ్వాలంటూ, బెదిరించి వసూలు చేశాడు. అది కూడా వ్యాపారి పంపించాడు. ఆ తరువాత ఆగస్టు 14న మరోసారి మరో ఫోన్ వచ్చింది. ఈసారి ఫోన్ చేసిన వ్యక్తి తాను ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ సిబ్బంది అని చెప్పుకొచ్చాడు. వ్యాపారితో  నగ్నవీడియో కాల్ మాట్లాడిన రియా శర్మ ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పాడు.  

ఆ వ్యాపారితో వీడియో కాల్ మాట్లాడడమే  ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమని  చెప్పి భయపెట్టాడు. ఆ తర్వాత  ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే రూ.80.97లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు.  కేసు పేరు వినగానే భయపడ్డ వ్యాపారి ఈ మొత్తాన్ని కూడా ముట్ట చెప్పాడు. అయితే ఇక్కడితో కూడా కథ ముగియలేదు. మరి కొన్నాళ్ల తర్వాత సిబిఐ అధికారినని చెబుతూ ఇంకో వ్యక్తి వ్యాపారికి  ఫోన్ చేశాడు. ఈసారి వీడియో కాల్ వ్యవహారంలో రియాశర్మ తల్లి  సిబిఐకి ఫిర్యాదు చేసిందని నమ్మించాడు. ఈ కేసును సెటిల్మెంట్ చేసుకోవాలని.. దీనికోసం రూ.8.5 లక్షలు డిమాండ్ చేశాడు. బాధిత వ్యాపారి ఈ నగదు కూడా చెల్లించాడు. 

ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పేరుతో  డిసెంబర్ 15న..  సదరు వ్యాపారి కేసు మూసివేసినట్లుగా నకిలీ ఉత్తర్వులు కూడా అందాయి. అయితే ఇక్కడే వారు పట్టుబడ్డారు. ఈ పత్రాలపై వ్యాపారికి అనుమానం వచ్చింది. దీంతో ఈ జనవరి 10న..  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రూ.2.69 కోట్లు కాజేసారని చెప్తూ మొత్తం 11 మందిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు నిందితులపై..  వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.  అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు.  పోలీసులు విచారణ జరుగుతున్నారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios