
Rahul Gandhi: లడఖ్ సరిహద్దులో చైనా వంతెన నిర్మించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. 'భవిష్యత్ శత్రు చర్యకు చైనా పునాది నిర్మిస్తోంది, దీనిని విస్మరించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం భారతదేశానికి ద్రోహం చేస్తోంది' అని పేర్కొన్నారు.
లడఖ్‌లో చైనా అతిక్రమణలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పోల్చడం నుండి దేశాన్ని రక్షించమని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పడం వరకు, రాహుల్ గాంధీ భారతదేశ చైనా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత చర్చలకు సాధ్యం కాదని, తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సోపై చైనా రెండవ వంతెనను నిర్మిస్తున్నట్లు వచ్చిన నివేదికలపై ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
లడఖ్ సరిహద్దులో కొనసాగుతున్న చైనా నిర్మాణం గురించి రాహుల్ గాంధీ కంటే ముందే.. జనరల్ ఆఫ్ అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అంశంపై యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ స్పందించారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ఆందోళనకరంగా ఉండని చార్లెస్ ఎ ఫ్లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఈ అక్రమ నిర్మాణంతో సరిహద్దులో అస్థిర వాతావరణం ఏర్పడుతుందని, ఇరు దేశాల సంబంధాలు కూడా దెబ్బ తింటాయని, ఇది చైనా కుటిల ప్రయత్నమని అన్నారు.
హిమాలయ ప్రాంతంలో చైనా చేస్తున్న నిర్మాణ పనుల గురించి కూడా అమెరికా జనరల్ ప్రస్తవించారు. (చైనీస్ ఆర్మీ) వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఈ అక్రమ నిర్మాణాలు అస్థిరపరిచే, ఒత్తిడి కలిగిస్తాయని అన్నారు. చైనా ఆర్మీ యొక్క వెస్ట్రన్ థియేటర్ కమాండ్ భారతదేశానికి సరిహద్దుగా ఉంది. చైనా అంతర్గతంగా రోడ్డు నిర్మాణాన్ని నిరంతరం పెంచుతోందని అమెరికన్ జనరల్ చెప్పారు. ఇది అస్థిరపరిచే. హానికరమైన ప్రవర్తన అన్నారు
చైనా వంతెన నిర్మాణం
చైనా ఆక్రమిత ప్రాంతమైన తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు పై చైనా ప్రభుత్వం.. మరో వంతెనను నిర్మిస్తోందని, ఈ ప్రాంతానికి తన సైన్యాన్ని సులభంగా, త్వరగా తరలించడంలో ఈ నిర్మాణం సహాయపడుతుందని గత నెలలో బయటపడింది. అలాగే.. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో.. రోడ్లు, నివాస ప్రాంతాల వంటి ఇతర మౌలిక సదుపాయాలను కూడా చైనా ఏర్పాటు చేస్తోంది.
లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్ మరియు చైనా ఇప్పటివరకు 15 రౌండ్ల సైనిక చర్చలు జరిపాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం LAC వెంట దాదాపు 50,000 నుండి 60,000 మంది సైనికులను చైనా మోహరించింది. ఇదిలా ఉంటే.. వియత్నాం, జపాన్ వంటి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వివిధ దేశాలతో చైనాకు సముద్ర సరిహద్దు వివాదాలు ఉన్నాయి.