అయోధ్య రామ మందిర ప్రత్యక్ష ప్రసారం తిరస్కరించొద్దు: తమిళనాడు సర్కార్ కు సుప్రీం ఆదేశం

By narsimha lode  |  First Published Jan 22, 2024, 11:42 AM IST

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి  నిషేధం విధించలేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 



న్యూఢిల్లీ: ఇతర వర్గాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారనే కారణంగా  శ్రీరామ మందిర  ప్రారంభోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిని తిరస్కరించలేమని సుప్రీంకోర్టు ప్రకటించింది.

అయోధ్యలోని  రామ్ లల్లా  ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని తిరస్కరించవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు  సోమవారంనాడు ఆదేశించింది.  

Latest Videos

undefined

ఇతర వర్గాలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నందన  ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిని తిరస్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.   శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రత్యేక పూజలు, భజనల నిర్వహణపై నిషేధం లేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

భగవాన్ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారంపై  డీఎంకె సర్కార్ నిషేధం విధించిందనే  ఆరోపణలతో  బీజేపీ నేతలు  అత్యవసరంగా  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం  ఈ ఆదేశాలు జారీ చేసింది.  బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శి వినోజ్ పి. సెల్వం తరపున న్యాయవాది జి. బాలాజీ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 

తమిళనాడు రాష్ట్రంలోని  అన్ని దేవాలయాల్లో అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  రాష్ట్రంలోని డిఎంకె సర్కార్ ప్రత్యక్ష ప్రసాదార్ని నిషేధించిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో  బీజేపీ ఆరోపించింది.
అన్ని రకాల పూజలు, అర్చనలు, అన్నదానం ,భజనలను కూడ నిషేధించినట్టుగా బీజేపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించింది. 

  అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని డీఎంకె సర్కార్ ని
షేధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు ఆరోపణలు చేశారు.

అయోధ్యలోని రామ మందిర  కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని  నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఎక్స్ లో ఆమె ఈ విషయమై  ట్వీట్ చేశారు. 

అయితే ఈ వాదనను   రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.  సేలంలో డీఎంకె  యువజన సదస్సు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు  తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని డీఎంకె కౌంటర్ ఇచ్చింది.  కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం దురదృష్టకరమని  డీఎంకె నేతలు పేర్కొన్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నదానం, శ్రీరాముడి పేరుతో పూజలు నిర్వహించడానికి దేవాలయాల్లో ప్రసాం అందించడానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. 
 

click me!