ఢిల్లీలో హ్యాట్రిక్ సీఎంలు: నాడు షీలా దీక్షిత్, గెలిస్తే నేడు కేజ్రీవాల్

By narsimha lodeFirst Published Feb 11, 2020, 10:54 AM IST
Highlights

న్యూఢిల్లీ రాష్ట్రంలో షీలా దీక్షిత్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించారు. ఈ దఫా ఎన్నికల్లో ఆప్ మెజారిటీని సాధిస్తే అరవింద్ కేజ్రీవాల్  హ్యాట్రిక్ సీఎంగా  చరిత్ర సృష్టించనున్నారు. 

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆప్ హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడోసారి అరవింద్ కేజ్రీవాల్   రాష్ట్రంలో  మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీ గతంతో పోలిస్తే తన సీట్లను పెంచుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ నెల 8వ తేదీన జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును మంగళవారం నాడు ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి ఆప్ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ఆధిక్యంలో  కొనసాగుతున్నారు.  

Also read:ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఆరు జిల్లాల్లో ఆప్ హవా

1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్ సీఎంగా పనిచేశారు. వరుసగా మూడు దఫాలు షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. హ్యాట్రిక్ సీఎంగా పనిచేసిన రికార్డు ఆమెకు ఉంది. 

ఆ తర్వాత  2003 డిసెంబర్ 1వ తేదీ నుండి 2008 నవంబర్29వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ రెండో సారి సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక మూడో టర్మ్‌లో 2008 నవంబర్ 29వ తేదీ నుండి 2013 డిసెంబర్ 28వ తేదీ వరకు ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ మూడో దఫా సీఎంగా పనిచేశారు.

2013 డిసెంబర్ 28వ తేదీ నుండి 2014 ఫిబ్రవరి 14వ తేదీన తొలిసారిగా ఆప్ తరపున  అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా సీఎంగా బాధ్యతలను చేపట్టారు.2014 ఫిబ్రవరి 14వ తేదీ నుండి 2015 ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉంది. 

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో మరోసారి ఆప్  అధికారాన్ని దక్కించుకొంది. 2015 ఫిబ్రవరి 14వ తేదీన  రెండోసారి ఆప్ అధికారాన్ని సాధించింది. రెండోసారి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  ప్రస్తుతం రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూనే అరవింద్ కేజ్రీవాల్  ఎన్నికలను ఎదుర్కొన్నారు. 

కేజ్రీవాల్ ప్రభుత్వం ఐదేళ్లుగా  ప్రజలకు ఇచ్చిన సౌకర్యాల  పట్ల ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన లభిస్తోందని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కంటే  ఎక్కువ స్థానాల్లో ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ దఫా కూడ  ఆప్  ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకొంటే షీలా దీక్షిత్ తర్వాత  హ్యాట్రిక్ సీఎంగా  అరవింద్ కేజ్రీవాల్ ఆ రికార్డును  స్వంతం చేసుకొంటారు.

అయితే షీలా దీక్షిత్ మూడు దఫాలు పూర్తి కాలం పాటు తన పదవిలో కొనసాగారు. అయితే తొలిసారిగా  సీఎంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పూర్తి కాలం పాటు అధికారంలో లేడు. 


 

click me!