పశ్చిమ బెంగాల్ స్కూల్ మిడ్ డే మీల్స్ లో చికెన్, సీజనల్ ఫ్రూట్స్.. ఓట్ల కోసమే అని విమర్శించిన బీజేపీ

By team teluguFirst Published Jan 6, 2023, 2:41 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు చికెన్, సీజనల్ ఫ్రూట్స్ అందించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఓట్ల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. 

ఈ ఏడాది రాబోయే పంచాయతీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జనవరి నుండి నాలుగు నెలల పాటు మధ్యాహ్న భోజనంలో చికెన్, సీజనల్ పండ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. బియ్యం, బంగాళాదుంపలు, సోయాబీన్, గుడ్ల మధ్యాహ్న భోజన మెనూతో పాటు పీఎం పోషన్ కింద అదనపు పోషకాహారం కోసం చికెన్, సీజనల్ పండ్లు వారానికి ఒకసారి అందించనున్నారు. ఈ అదనపు పౌష్టికాహార పథకానికి రూ.371 కోట్లు మంజూరయ్యాయి.

కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని కాపాడితే.. బీజేపీ మ‌తం, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తోందంటూ ఖర్గే ఫైర్

అదనపు పోషకాహార పథకాన్ని విడుదల చేస్తున్నట్లు ధృవీకరించిన పాఠశాల శాఖ అధికారి ఒకరు ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారని ‘టైమ్స్ నౌ’ ఓ కథనంలో పేర్కొంది. కాగా.. మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు ప్రస్తుతం బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు, సోయాబీన్, గుడ్లు ఇస్తున్నారు. ప్రతీ విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ .20 ఖర్చు అవుతుందని, ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని జనవరి 3న విడుదలైన నోటిఫికేషన్ పేర్కొంది. 

ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1.16 కోట్లకు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60 : 40 నిష్పత్తిలో ఖర్చును పంచుకోనున్నాయి. 371 కోట్ల అదనపు కేటాయింపులు పూర్తిగా రాష్ట్రమే భరించనుంది. భార్యను హతమార్చి రెండు ముక్కలు చేసి నదిలో పడేసిన భర్త.. అక్రమ సంబంధం అనుమానంతో ఘాతుకం

కాగా.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ‘‘ఎన్నికల ముందు పాఠశాల విద్యార్థులకు చికెన్ వడ్డించాలనే నిర్ణయం టీఎంసీ ప్రభుత్వం ఆలోచనలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. పేద పిల్లలకు ఇన్ని రోజులు ఇవి అందించకుండా ఇప్పటి వరకు బియ్యం, పప్పు మాత్రమే ఎందుకు ఇచ్చారు ? పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్లను సంపాదించడానికే రాజకీయ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.’’ అని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు.

ప్రయాణికుడిపై ట్రైన్ టికెట్ కలెక్టర్‌ల దాష్టీకం.. కింద పడేసి ఇద్దరు అధికారుల దాడి
 
అయితే దీనికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రతిపక్షాలు ప్రతీ దాంట్లో రాజకీయ వాసన చూస్తున్నాయని ఆరోపించింది. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలబడతారని, ఈ నిర్ణయం ఆ వాస్తవాన్ని పునరుద్ఘాటిస్తోందని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు శాంతను సేన్ అన్నారు. ప్రతీ అంశంపైనా రాజకీయాలు చేయాలనుకునే బీజేపీలా కాకుండా తమ పార్టీ ప్రజా కేంద్రిత పార్టీ అని అన్నారు. ‘‘కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో మన రాష్ట్రం పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని కోల్పోకుండా చూసుకుంది. పాఠశాల భవనాల నుండి బియ్యం, పప్పుధాన్యాలు, బంగాళాదుంపలు, సోయాబీన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయలేదు’’ అని ఆయన అన్నారు. 

click me!