అయోధ్య తర్వాత.. రేపు మరో కీలక తీర్పు: వివాదం సుప్రీం విషయంలోనే

By Siva KodatiFirst Published Nov 12, 2019, 5:41 PM IST
Highlights

దశాబ్ధాల నాటి అయోధ్య భూ వివాదం కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్ధమైంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పును చెప్పనుంది

దశాబ్ధాల నాటి అయోధ్య భూ వివాదం కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్ధమైంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పును చెప్పనుంది.

సుప్రీంకోర్టుతో పాటు చీఫ్ జస్టిస్ కార్యాలయం సైతం ప్రభుత్వ సంస్థలేనని.. అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది.

అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర ప్రజా సమాచార అధికారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 4న తీర్పును వెలువరించింది.

బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును చెప్పనుంది. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.

Also Read:Ayodhya verdict: రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కొలీజియం చర్చలు లాంటి అత్యంత రహస్య సమచారం బయటికి వెల్లడించడం ప్రమాదకరమని, అది న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడింది. 

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం నాడు  కీలక తీర్పును ఇచ్చింది.రామ జన్మభూమి న్యాస్‌కే భూమిని ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయోధ్య వివాదానికి సంబంధించి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఐదు ఎకరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని ఇవ్వొచ్చని కూడ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో  వెల్లడించింది.

Also read:ayodhya verdict: అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం.. వారికి కోర్టు ప్రశంసలు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు.అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ నిర్వహించాలని కూడ సుప్రీంకోర్టు తెలియజేసింది.

మూడు నెలల్లోపుగా కేంద్రం  అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కూడ సుప్రీం కోర్టు ఆదేశించింది.గతంలో అలహాబాద్ కోర్టు ముగ్గురు సమానంగా వివాదస్థలాన్ని పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.అయితే ఈ తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

click me!