Chennai Cop Rajeswari: హ్యాట్సాఫ్.. వ్యక్తిని భుజాలపై మోసుకెళ్లిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. వైరల్ వీడియో

By team teluguFirst Published Nov 11, 2021, 4:45 PM IST
Highlights

టీపీ చత్రం (TP Chatram) ప్రాంతంలోని శ్మశాన వాటికలో చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో టీపీ ఛత్రం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి (Chennai inspector Rajeswari ) తన తోటి పోలీసులతో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని ఆమె తన భుజాలపై మోసుకుని వచ్చి.. అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
 

తమిళనాడులో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. చెన్నై, కాంచీపురం సహా పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా చెన్నైలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలయమం అయ్యాయి. చాలా చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సాయం కోసం ప్రజలు సంప్రదించడానికి కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. 

అవసరమున్న చోటుకు విపత్తు నిర్వహణ బృందాలతో పాటుగా స్థానిక ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేరుకుని సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో సహాయక చర్యల్లో పాల్గన్న ఓ మహిళ పోలీసు ఆఫీసర్ చేసిన పనికి ఇప్పుడు అంతా సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని ఆమె తన భుజాలపై మోసుకుని వచ్చి.. అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

Also read: తమిళనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ: చెన్నైలో సబ్‌వేల మూసివేత

 

 

టీపీ చత్రం (TP Chatram) ప్రాంతంలోని శ్మశాన వాటికలో చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో టీపీ ఛత్రం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి (Chennai inspector Rajeswari ) తన తోటి పోలీసులతో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. శ్మశాన వాటికలో 3 రోజులుగా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్ అనే 25 ఏళ్ల స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతను చనిపోయినట్టుగా భావించినప్పటికీ అతడు ప్రాణాలతో ఉన్నట్టుగా తేలింది. దీంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 

ఎవరి సాయం తీసుకోకుండా అతడిని తన భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగింది. తొలుత పోలీసు వాహనంలో ఉన్న దుప్పట్లును తీసుకుని.. అతని ఆటో వద్దకు తీసుకెళ్లింది. ఆటో వద్దకు చేరిన తర్వత అందులో దుప్పట వేసి.. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సహాయక చర్యల్లో మహిళ పోలీసు రాజేశ్వరి చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయ్ కుమార్ శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తి.

click me!