వైఫై యూజర్ నేమ్ ‘‘ జాయిన్ హిజ్బుల్ ముజాహిద్దీన్’’... ఢిల్లీలో అలజడి

By Siva KodatiFirst Published Mar 1, 2019, 11:36 AM IST
Highlights

వైఫై యూజర్ నేమ్ నలుగురి కన్నా వెరైటీగా ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. అంతే వెరైటీగా పెట్టాడు. దీంతో అది కాస్త దేశ రాజధానిలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించింది. 

వైఫై యూజర్ నేమ్ నలుగురి కన్నా వెరైటీగా ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. అంతే వెరైటీగా పెట్టాడు. దీంతో అది కాస్త దేశ రాజధానిలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ప్రాంతంలో సెల్‌ఫోన్‌లో వైఫైను అనేబుల్ చేయగా... యూజర్ నేమ్‌గా ‘జాయిన్ హిజ్బుల్ ముజాహిద్దీన్’’ అనే నేమ్ డిస్ ప్లే అయ్యింది.

దీనిపై ఓ ఇంజనీర్ ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. సర్జికల్ స్ట్రైక్స్, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కంగారుపడిన పోలీసులు ఎలాగో కష్టపడి గుల్షన్ తివారీ అనే వృద్ధుడి ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్ పేరు జాయిన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అని గుర్తించారు.

ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాము గతేడాది నవంబర్ 26న ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నామని.. యూజర్ నేమ్ తన చిన్న కొడుకు పెట్టాడని తెలిపాడు. ఈ క్రమంలో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సమాధానం విని ఖంగుతిన్నారు.

చుట్టుపక్కల వారు తమ వైఫెని సులభంగా కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ వాడుతున్నారని. వాళ్లను వాడకుండా చేసేందుకు ఈ పేరుని యూజర్‌నేమ్‌గా సెట్ చేసినట్లు తెలిపాడు. అప్పటి నుంచి ఎవరు తమ వైఫైని కనెక్ట్ చేసుకోవడం లేదంటూ చెప్పాడు. దీనిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 

click me!