
పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ మరికాసేపట్లో భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. అభినందన్ ని విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన రాకకోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. ఆయనను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూనే... పాక్ మరో మెలిక పెట్టింది. పాకిస్తానీయులు మరోసారి వారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.