
రాజస్థాన్ సీఎం మారబోతున్నారని గత కొంత కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ప్రధాన్యతను సంతరించుకుంది. జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దీంట్లో నాయకత్వ మార్పుపై తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది.
అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు 'చనిపోయిన' మహిళ రిటర్న్.. పూడ్చిన శవాన్ని బయటకు తీసి..
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగే సమావేశంలో రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్, రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. కొత్త ముఖ్యమంత్రి కోసం సచిన్ పైలట్, స్పీకర్ సీపీ జోషిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం సీపీ జోషి వైపే మొగ్గు చూపుతుండగా.. చాలా మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతుగా ఉన్నారు.
మూడో తరగతి విద్యార్థినికి న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించిన ప్రిన్సిపాల్.. ఎఫ్‌ఐఆర్ నమోదు
కాగా.. అంతకుముందు శనివారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని అజయ్ మాకెన్ కలిశారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు జైపూర్‌లో జరగనున్న రాజస్థాన్ సీఎల్‌పీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను పరిశీలకులుగా నియమించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు. తాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అశోక్ గెహ్లాట్ ఇటీవల బహిరంగంగానే స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వలస కూలీలు దుర్మరణం
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మధ్య పోటీ నెలకొంది. సెప్టెంబరు 30 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది. ఈ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 19న కొత్త కాంగ్రెస్ చీఫ్ ప్రకటన ఫలితాలు వెల్లడించనున్నారు. 25 ఏళ్లలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. గతంలో 1997లో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సీతారాం కేసరి శరద్ పవార్, రాజేష్ పైలట్‌లను ఓడించారు.