ఐసీసీ వరల్డ్ కప్ 2023: ఫైనల్ లో ఇండియా గెలిస్తే ఉచిత భోజనం

By narsimha lode  |  First Published Nov 19, 2023, 12:43 PM IST

ప్రపంచ వ్యాప్తంగా భారత, అస్ట్రేలియా మధ్య జరిగే  క్రికెట్  ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ మ్యాచ్ కోసం  దేశ వ్యాప్తంగా పలువురు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఓ దాబా యజమాని ఉచిత భోజన ఆఫర్ ప్రకటించారు. 


న్యూఢిల్లీ:  ప్రపంచకప్ పురుషుల  క్రికెట్ పోటీల్లో  భారత్ జట్టు గెలిస్తే   తన హోటల్ లో  ఉచితంగా భోజనం అందించనున్నట్టుగా  హోటల్ యజమాని  నరేంద్ర సింగ్ చెప్పారు.   1983 లో అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలో  భారత జట్టు  ప్రపంచకప్ ను సాధించిన నాటి నుండి తాను ప్రతి ప్రపంచకప్ పోటీలను తిలకిస్తున్నట్టుగా నరేంద్ర సింగ్ చెప్పారు.  ఈ దఫా  ప్రపంచకప్ ను భారత జట్టు గెలిస్తే తాను ఉచితంగా భోజనం అందిస్తానన్నారు.

చండీగఢ్ నివాస్ తేజిందర్ సింగ్ నరేంద్ర సింగ్ చొరవను ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టు  బలంగా ఉందన్నారు. ప్రపంచకప్ లో ప్రతి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించిన విషయాన్ని నరేంద్ర సింగ్ గుర్తు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో కూడ విజయం సాధిస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Latest Videos

న్యూజిలాండ్ పై విజయం సాధించి  సెమీఫైనల్ నుండి ఫైనల్ కు చేరుకుంది.  ఆల్ రౌండ్ ప్రదర్శనతో  భారత్  70 పరుగుల తేడాతో  న్యూజిలాండ్ ను ఓడించి  ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది.   ఇదిలా ఉంటే  ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మరో మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి అస్ట్రేలియా  ఫైనల్ కు చేరింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో  ఇవాళ భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య  ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

click me!