Sanitation Workers:  పారిశుద్ధ్య కార్మికులకు కొర‌వ‌డిన ర‌క్ష‌ణ‌..  వారి మ‌ర‌ణాల‌పై కేంద్రం వివ‌ర‌ణ‌

Published : Jul 20, 2022, 04:48 PM IST
Sanitation Workers:  పారిశుద్ధ్య కార్మికులకు కొర‌వ‌డిన ర‌క్ష‌ణ‌..  వారి మ‌ర‌ణాల‌పై కేంద్రం వివ‌ర‌ణ‌

సారాంశం

Sanitation Workers: మ‌న‌దేశంలో పారిశుద్ద్య కార్మికుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 347 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారని, ఇలాంటి మ‌ర‌ణాలు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ నమోదయ్యాయని  ప్రభుత్వం వెల్లడించింది.

Sanitation Workers: మన దేశంలో పారిశుద్ధ్య పనులు ర‌క్ష‌ణ కొర‌వడింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 347 మంది పారిశుధ్య కార్మికులు మరణించారని, ఈ త‌ర‌హా మర‌ణాలు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం  వెల్లడించింది. 

భారతీయ జనతా పార్టీ (BJP) పార్లమెంటేరియన్లు సుబ్రత్ పాఠక్, మనోజ్ తివారీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ స్పందిస్తూ..  “మురుగు కాలువలు,  సెప్టిక్ ట్యాంకుల శుభ్రపరిచే స‌మ‌యంలో ప్రమాదాలు, విషవాయువులు లీకవ్వడం వంటి ఘటనల కారణంగా కార్మికులు మరణించారని, ఇలా సంభవించే మరణాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది అని అన్నారు. 

సంవత్సరాల వారీగా మరణాల వివరాలను కూడా కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా ఇక రాష్ట్రాలవారీగా లెక్కలను పరిశీలిస్తే.. గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా 51 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో 48 మంది, ఢిల్లీలో 44 మంది కన్నుమూశారు. 2019లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సెప్టెక్ ట్యాంకు ఘటనల్లో 26 మంది ప్రాణాలు వదిలారు. ఇక 2022 విషయానికి వస్తే ఇప్పటివరకు 17 మంది కార్మికులు చనిపోయారు. అధికంగా తమిళనాడు(5), ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(4) ఉన్నాయి.
 
గత ఐదేళ్లలో ఇలాంటి మరణాలు 2019లో అత్యధికంగా సంభవించాయనీ, 2019లో 116 మంది చనిపోగా.. 2017లో 92 మంది మృత్యువాతపడ్డారని, 2022లో ఇప్పటివరకు 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రాల ప‌రంగా ప‌రిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 51 మంది, తమిళనాడులో 48 మంది, ఢిల్లీలో 44 మంది మరణించారని తెలిపారు. ఇక 2022లో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యధికంగా తమిళనాడు ఐదుగురు, యుపిలో న‌లుగురు మ‌ర‌ణించార‌ని తెలిపారు.  
 
ఇదే స‌మ‌యంలో ఇటువంటి సంఘటనలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ..  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబోరేటరీని ఏర్పాటు చేశామని మంత్రి వీరేంద్ర కుమార్ వివరించారు. ఇది కాకుండా, ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్ల కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE), స్వచ్ఛతా ఉద్యమి యోజన, మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం మరియు ఇతర అనేక పథకాలను కూడా రూపొందించింది. అలాగే వారి స‌మ‌స్య‌ల‌ పరిష్కారాన్నికేంద్రం సిద్ధంగా ఉంద‌నీ,  స్థానిక సంస్థలు వీటిని ఉపయోగించవచ్చునని  తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం పలు స్కీమ్‌లను ప్రవేశపెట్టామని మంత్రి వీరేంద్ర కుమార్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu