వలస కూలీలను ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకొన్నామని కేంద్రం తెలిపింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ను అమలు చేయనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.దీని ద్వారా దేశంలో ఎక్కడి నుండైనా వలస కార్మికులు రేషన్ తీసుకొనే వెసులుబాటు కలుగుతోందన్నారు మంత్రి.
న్యూఢిల్లీ: వలస కూలీలను ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకొన్నామని కేంద్రం తెలిపింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ను అమలు చేయనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.దీని ద్వారా దేశంలో ఎక్కడి నుండైనా వలస కార్మికులు రేషన్ తీసుకొనే వెసులుబాటు కలుగుతోందన్నారు మంత్రి.
గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు.
undefined
also read:రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రాలకు రూ.6700 కోట్లు: నిర్మలా సీతారామన్
మార్చి 28 నుండి సిటీల్లో నిరాశ్రయులైన వాళ్లకు మూడు పూటల బలవర్ధకమైన ఆహారం అందించామని కేంద్ర మంత్రి తెలిపారు.పట్టణ పేదలకు లక్షా 25 వేల లీటర్ల శానిటైజర్లు, 3 కోట్ల మాస్కులు అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ కింద వలస కూలీలకు బస, ఆహారం, తాగు నీరు ఇచ్చామన్నారు.
ఇక నుండి అసంఘటిత రంగంలో ప్రతి ఒక్కరికి కూడ అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇక నుండి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
వలస కార్మికులు ప్రభుత్వం నుండి పొందే ప్రయోజనాలను ఎక్కడి నుండైనా తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం అన్ని పోర్టబులిటి సౌకర్యాన్ని కల్పించనుందని చెప్పారు.మహిళలు పనిచేసే చోట వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పది మందితో కలిసి పనిచోట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని మంత్రి చెప్పారు.
కార్మికుల్లో కేవలం 30 శాతం మందికి మాత్రమే కనీస వేతనాలు అందుతున్నాయన్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడ కనీస వేతనం అందించేలా చర్యలు తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చారు.
వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 8 కోట్ల మంది వలస కూలీలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్టుగా కేంద్రం తెలిపింది. రానున్న రెండు నెలలు కూడా వలస కూలీలకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి బియ్యం లేదా గోధుమలు కేజీ శనగలను ఉచితంగా ఇవ్వనున్నారు. దేశంలో ఇప్పటికే 83 శాతం రేషన్ కార్డుల పొర్టబిలిటి పూర్తైందని మంత్రి తెలిపారు.
ఆగష్టు వరకు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. రేషన్ కార్డు లేకపోయినా కూడ వలస కూలీలకు రేషన్ అందిస్తామన్నారు. వలస కూలీలకు ప్రత్యేక రేషన్ కార్డులు అందిస్తామన్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఈ కార్డు ద్వారా రేషన్ తీసుకొనే వెసులుబాటు లభిస్తోందని చెప్పారు నిర్మలా సీతారామన్
ఈ ఏడాది ఆగష్టు నాటికి 23 రాష్ట్రాల్లోని 83 శాతం కూలీలకు రేషన్ అందుబాటులోకి వస్తోందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వంద శాతం రేషన్ కార్డుల పొర్టబులిటీ పూర్తి కానుందని మంత్రి తెలిపారు.
వలస కార్మికులకు ఉపాధి హామీ పని కల్పించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది. తాము ఉన్న చోటునే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉపాధిని పొందవచ్చని వలస కూలీలకు కేంద్రం సూచించింది.