వలస కార్మికులు, రైతులు, చిరు వ్యాపారుల కోసం 9 పాయింట్ ఫార్ములా: నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published May 14, 2020, 4:24 PM IST

:సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఈ ఏడాది మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సన్న, చిన్న కారు రైతులకు  ఇప్పటికే రూ. 4 లక్షల కోట్లు రైతులకు చెల్లించినట్టుగా ఆమె గుర్తు చేశారు. 


న్యూఢిల్లీ:సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఈ ఏడాది మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సన్న, చిన్న కారు రైతులకు  ఇప్పటికే రూ. 4 లక్షల కోట్లు రైతులకు చెల్లించినట్టుగా ఆమె గుర్తు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగిన వారికి రూ. 25 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా ఆమె చెప్పారు.

కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను  ఇచ్చినట్టుగా ఆమె తెలిపారు.వలస కార్మికులు, రైతులు, వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

Latest Videos

undefined

also read:డిస్కంలకు రూ. 90వేల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. వలసకూలీలు, వీధి, చిరు వ్యాపారులు, చిన్న, సన్న కారు రైతులకు ఈ ప్యాకేజీ వర్తిస్తోందన్నారు. వ్యవసాయానిక ఊతంగా ఈ ప్యాకేజీ ఉంటుందన్నారు.
 

click me!