కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి అస్వస్థతకు కారణమేమిటో తేల్చేసిన డాక్టర్లు..

By Asianet News  |  First Published May 1, 2023, 9:55 AM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఛాతీ నొప్పి రావడానికి గ్యాస్ ప్రాబ్లమే ప్రధాన కారణమని డాక్టర్లు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. నేడు కేంద్ర మంత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. 


కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ఆరోగ్యం ఆదివారం రాత్రి క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించిన సంగతి తెలిసిందే. మంత్రి కుటుంబ సభ్యులు ఆయనను దాదాపు 11 గంటల ప్రాంతంలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆయనకు కార్డియో న్యూరో సెంటర్ లోని కార్డియాక్ కేర్ యూనిట్ లో చికిత్స అందించారు. కిషన్ రెడ్డికి ఛాతీ నొప్పి వచ్చిందని డాక్టర్లు తెలిపారు.

మోడీ జీ.. నా అన్నరాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి - కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ

Latest Videos

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే తరువాత ఆయన అస్వస్థతకు కారణం ఏంటో తెలిపారు. కిషన్ రెడ్డికి ఛాతీ నొప్పి రావడానికి గ్యాస్ సమస్యే కారణమని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవకాశం ఉందని తెలుస్తోంది. 

కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం

కాగా.. మంత్రి అస్వస్థతకు గురి కావడానికి ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' దేశ వారసత్వం, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. దేశ రాజధానిలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో రేడియో కార్యక్రమం 100వ ఎపిసోడ్ ను పురస్కరించుకుని 'జన్ శక్తి: ఎ కలెక్టివ్ పవర్' ఎగ్జిబిషన్ ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. శనివారం కూడా ఆయన ఆరోగ్యంగానే కనిపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంగా పుష్కర యాత్ర పూరీ-కాశీ-అయోధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ గౌరవ్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన యాత్రికులకు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించే గొప్ప అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోందన్నారు.

click me!